Breaking News

ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్‌ : క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌ వైరల్‌

Published on Fri, 03/21/2025 - 16:19

ప్రేమికులు  ప్రైవసీ కోసం పార్క్‌లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్‌ క్యాబ్‌లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్‌  డ్రైవర్‌ పెట్టిన నోటు దీనికి  ఉదాహరణగా ని లుస్తోంది.  ప్రస్తుతం ఇది  నెట్టింట తెగ వైరల్‌అవుతోంది.  

తన  క్యాబ్‌లో  ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్  తన కారులో ఒక నోట్‌ పెట్టాడు. జంటలను  నో  రొమాన్స్‌.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్‌.. ఇది క్యాబ్,  ప్రైవేట్  ప్లేసో, OYO  కాదు.. సో దయచేసి దూరంగా, కామ్‌గా ఉండండి." అంటూ ఒక నోట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. 

డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో  అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్‌లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి  విన్నాను.. అని  ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్‌కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్‌లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్‌లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు  నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు  హైలైట్‌గా  నిలుస్తాయి. ఆన్‌లైన్ మీమ్‌లకు కేంద్రంగా ఉంటాయి.   
 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)