Breaking News

కసావు చీరలో నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..తయారీకే ఏకంగా..!

Published on Mon, 07/22/2024 - 12:02

నీతా అంబానీ నాటి సంప్రదాయ చీరల మేళవింపుతో సరికొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌ని తీసుకొచ్చింది. చేతి వృత్తుల వారిని పోత్సహించేలా కనుమరుగవుతున్న నాటి గొప్ప కళా నైపుణ్యాన్ని అందరికీ సుపరిచయ చేస్తున్నారు నీతా. ఇటీవల చిన్న కుమారుడు అనంత్‌ రాధికల వివాహంలో సైతం వారి ధరించే ప్రతి డిజైనర్‌ వేర్‌ చేతితో రూపొందించిన ఎంబ్రాయిడరీ డిజైన్‌ హైలెట్‌గా నిలిచింది. రాజస్థాన్‌, కాశీ పట్టణాల్లో ఉన్న పురాతన హస్తకళలను స్ఫురణకు తెచ్చేలా చేశారు. 

అయితే మరోసారి  నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌(ఎన్‌ఎంఏసీసీ)లో జరిగిన ఈవెంట్‌లో కేరళ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా కసావు చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరను కేరళలోని ప్రతిభావంతులైన కళాకారులు ఏకంగా 20 రోజుల పాటు రూపొందించారు. ఇందులో టిష్యూ పల్లు, మెరూన్‌ మీనా కరి బుట్టా, అద్భతమైన తొమ్మిది అంగుళాల బంగారు అంచు మృదువైన షీన్‌లు ఉన్నాయి. తెలుపు బంగారు రంగులో ఉన్న ఈ కసావు చీర చరిత్ర చాలా లోతైనది. బహుళ వర్ణ ఛాయచిత్రాలు, బోల్ట్‌ నమునాలతో చిక్కటి కాటన్‌ చీరల్లా మెత్తగా ఉంటాయి.

కేరళ కసవు చీరల ప్రత్యేకత..
ఇవి చూసేందుకు సరళమైన క్లాసీగా ఉండే కసవు చీర జరీ, ఒక రకమైన బంగారు దారంతో విలక్షణంగా ఉంటుంది. బలరామపురుం, చెందమంగళం, కుతంపుల్లి వంటి నిర్థిష్ట భౌగోళిక సముహాల నుంచి ఉద్భవించిన ఈ చీరలు కేరళ గొప్ప చేనేత వారసత్వంలో భాగంగా ఉన్నాయి. ప్రాథమిక డిజైన్‌ల నుంచి దాదాపు మూడు నుంచి 5 రోజుల వరకు పట్టే విస్తృతమైన మోటిఫ్‌లు చేతితో నేయబడి ఉంటాయి. బంగారు దారంతో చుట్టూ బోర్డర్‌ డిజైన్‌ చేసి ఉంటుంది. 

సరసమైన కాటన్‌ రకాల నుంచి వివిధ రకాల చీరలను ఉత్పత్తి చేస్తారు. వీటి ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలై అత్యంత ఖరీదైన ధర పలికే చీరలు కూడా ఉంటాయి. చూసేందుకు సాదాసీదా తెల్లని వస్త్రంలా ఉన్నా బార్డర్‌ మందం, రంగు అనేవి సందర్భానుసారం డిజైన్‌ చేసిన చీరలు ఉంటాయి. ఉత్సవానికి సంబంధించిన చీరలు మందమైన బంగారు అంచుతో ఎంట్రాక్టివ్‌గా ఉంటాయి. 

(చదవండి: అనంత్‌ అంబానీ బూండీ జాకెట్‌..రియల్‌ గోల్డ్‌తో ఏకంగా 110 గంటలు..!)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)