Breaking News

ట్రంప్‌ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..

Published on Mon, 01/20/2025 - 18:15

అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన విందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్(Reliance Foundation chairperson) నీతా అంబానీ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార ప్రముఖులు, ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ ‍ప్రైవేట్‌ డిన్నర్‌లో నీతా అంబానీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నలుపురంగు కాంచీపురం(Kanchipuram) చీరకట్టులో కనిపించారు. ఈ ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నీతా తన ఆహార్యంతో అందంగా ప్రతిబింబించారు. నీతా ధరించిన ఈ చీరకు, మెడలోని హారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!.
 

ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా ఈ నలుపు రంగు కాంచీపురం చీరను డిజైన్‌ చేశారు. భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యానికి నివాళిగా నిలిచే ఈ అందమైన చీరను నేసింది జాతీయ అవార్డు గ్రహీత బి. కృష్ణమూర్తి. ఆయన సహకారంతోనే మనీష్ మల్హోత్రా అందంగా డిజైన్‌ చేశారు. ఈ చీర కాంచీపురం దేవలయాల వివరాలు, వాటి కథను ప్రతిబింబిస్తుంది.

భారతదేశ ఆధ్యాత్మికతకు, సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ చీర. ఇక ఈ చీరకు సరిపోయేలా పూర్తినెక్‌ని కవర్‌ చేసేలా ఫుల్‌ హ్యండ్స్‌ ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌ని ఎంచుకంది. ఇది నీతాకి అక్కడ చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తుంది. అతిరథ మహరథులు విచ్చేసే ఈ వేదికను నీతా ఆధునికతతో కూడిన సంప్రదాయన్ని మిళితం చేసి ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇచ్చారు. 

హైలెట్‌గా 200 ఏళ్ల నాటి లాకెట్టు..
ఈ అందమైన సంప్రదాయ చీరకు తగ్గట్టుగా చిలుక ఆకారంలో ఉండే అరుదైన 200 ఏళ్ల నాటి పురాతన లాకెట్టు(Pendant)ని ధరించింది. ఈ పురాతన కుందన టెక్కిక్‌తో తీర్చిదిద్దిన హారం రాయల్టీని హైలెట్‌ చేసింది. ఈ నెక్లెస్‌ని పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలతో రూపొందించారు.

(చదవండి: ట్రంప్ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లో స్టైలిష్‌గా ఉషా వాన్స్‌ దంపతులు..!)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)