Breaking News

బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ

Published on Sun, 08/30/2026 - 12:55

కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన వారిని చూసి..వాళ్లలా తగ్గిపోదాం అనుకుంటాం. కానీ ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా నిలకడ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం. ఇక్కడ అలాంటి సమస్యలే ఎదుర్కొని, ఎంతో నిజాయితీగా తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి చెప్పి..ఆలోచింప చేసింది మళయాళం నటి నిమిషా సజయన్‌. తను ఒక పాత్ర కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గాడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఆ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయంటూ తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మరి అవేంటో చూద్దామా..!.

నటి నిమిషా సజయన్‌ సోషల్‌​ మీడియా వేదికగా 'బబితా సింగ్ రిపోర్టింగ్' అఏ మూవీ కోసం ఏకంగా 14 కిలోలు బరు పెరిగానని తెలిపారు. అయితే ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌ గురించి సవివరంగా వెల్లడించారు. అంతేగాదు బరువు తగ్గక ముందు, ఆ తర్వాత పోటోలను పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తాను బబితా సింగ్‌ రిపోర్టింగ్‌ మూవీలో బబితా పాత్ర కోస ఏకంగా 58 నుంచి 72 కిలోలు పెరిగినట్లు తెలిపారు. 

ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తొలి పది రోజులు సైన నిద్ర లేక తీవ్రమైన మానసిక సమస్యలు, అలసట, అసహనం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఒకానొక సమయంలో ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశానని కూడా అన్నారు. బరువు తగ్గడం కోసం చేస్తున్న వర్కౌట్లు, డైటింగ్‌ విషయంలో కళ్లల్లో నీళ్లు తిరిగేవని చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ట్రైనర్‌ సాయంతో జయించి ముందుకు సాగానని, అందుకు అతనికి చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్పారామె. 

నిజంగానే వెయిట్‌లాస్‌ జర్నీలో ఒక్కోసారి పూర్తి స్థాయిలో అనుకున్నట్లుగా చేయలేకపోయినా.. తర్వాత నుంచి కొనసాగి ముందుకుపోవాలని అంటున్నారామె. ఒక్కోసారి స్కిప్‌ అయితే లైట్‌ తీసుకుంటూ పోవాలే గానీ, ఆపేద్దాం అనుకున్నారో అధిక బరువుని తగ్గించుకోవడంలో ఢమాల్‌ అని పడిపోయినట్లే లెక్క అని అంటోంది. 

అపరాధ భావనకు తావు లేకుండా మధ్య మధ్యలో తప్పడం అనేది సహజం అని సానుకూలంగా తీసుకుంటూ సాగితే ఆటోమేటిగ్గా బరువు తగ్గడమే కాకుండా మీరు ఏర్పరుచుకున్న వెయిట్‌ లాస్‌ నియమాలు దైనందిన జీవితంలో తెలియకుండా భాగమవుతాయని అంటోంది. అలాగే మంచి నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనలు సలహాలతో బరువు తగ్గే యత్నం చేస్తే..ఎలాంటి మానసిక, అనారోగ్య సమస్యలనైనా తట్టుకుని బరువు తగ్గగలమని నమ్మకంగా చెబుతోందామె.

 

(చదవండి: ఒక్కసారి సిజేరియన్‌..మళ్లీ అదేనా?)

 

Videos

Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే

సంచలన సర్వే రిపోర్ట్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయం..!

మెప్మా ఉద్యోగిని వేధిస్తున్న TDP నేత శ్రీనివాసరావు

రష్యా డ్రోన్ల విధ్వంసకర దాడులు

నంద్యాలలో దద్దరిల్లిన YSRCP ఛలో కలెక్టరేట్ కార్యక్రమం

మంత్రి ఆనంకు బాబు ఘోర అవమానం వైరల్ అవుతున్న వీడియో

చంద్రబాబును డిమాండ్ చేస్తూ గుంటూరులో ఏపీ JAC నేతల నిరసన ర్యాలీ!

Viral Video: వరదల్లో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఏనుగు అండ

పులివెందులకు YS జగన్..

Kakinada : నా భర్తను హత్య చేయించింది కటౌట్ శ్రీను

Photos

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)

+5

నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)