Breaking News

కొత్త సంవత్సరం .. కొత్త ఆశలు..ఆశయాలు

Published on Thu, 01/01/2026 - 17:15

మనిషి ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్కించటం కూడా ప్రారంభించాడు. ప్రకృతిలో వస్తున్న మార్పులని పరిశీలించి, తదనుగుణంగా ఉండటం కోసం కాలాన్ని కూడా గణించటం ప్రారంభించాడు. కాలగణనకి ప్రమాణం ప్రకృతిలో జరిగే పరిణామాలే. కొద్దికాలం జరిగిన తరవాత మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టే ప్రకృతి కనపడితే ఈ క్రమం ఏమిటి? అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనిషి కాలాన్ని లెక్కపెట్టటం జరిగింది. 

ఒక్కొక్క ప్రాంతం వారు వారికి అనుకూలంగా ఉన్న సమయం నుండి లెక్కపెట్టటం మొదలు పెట్టారు. కాలక్రమంలో దానిలో ఒక హేతుబద్ధతని అవలంబించారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే సమయాన్ని కాలగణనకు మొదలుగా తీసుకున్నారు. పాశ్చాత్యులకి ఆహ్లాదకరంగా ఉండే వసంతం (స్ప్రింగ్‌)మార్చ్, ఏప్రిల్‌ నెలలు. మార్చ్‌ 23ని సంవత్సర మానానికి ఆదిగా పరిగణించేవారు. తరువాత నెల మధ్యలో ఎందుకని ఏప్రిల్‌ 1 ని సంవత్సరాదిగా జరుపుకునే వారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అది జనవరి 1కి మారింది. 

మార్చ్‌ మొదటి నెల కనుక డిసెంబర్‌ 10 వ నెల, నవంబర్‌ 9 వ నెల, అక్టోబర్‌ 8 వ నెల, సెప్టెంబర్‌ 7 వ నెల అయ్యాయి. ఆ పేర్లే నెలల సంఖ్యని తెలియ చేస్తున్నాయి. ఈ కాలెండర్‌ ని గ్రెగేరియన్‌ కాలెండర్‌ అంటారు. అందరికీ తమ కాలెండర్‌ ఉన్నా, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాలెండర్‌ నే అనుసరిస్తోంది.

ఈ కాలెండర్‌ ప్రకారం జనవరి ఒకటో తారీకుతో కొత్త సంవత్సరం మొదలు అవుతుంది. సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో 365 1/3 రోజులు ఉంటాయి. అందుకని నాలుగు సంవత్సరాలకి ఒక మారు లీప్‌ సంవత్సరం అని ఒకరోజు అధికంగా వస్తుంది. ఆ రోజు తక్కువ రోజులు ఉండే ఫిబ్రవరికి వెడుతుంది. 

అయితే ఆనందోత్సాహాలు ఎందుకు? ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు. ఆ విధంగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం.

కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళని, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్తబట్టలు, మిఠాయిలు పంచుకోవటాలు, విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటమే వీటిలోని అసలు అర్థం. కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరాని వాటిని పక్కకి పెట్టి, అవసరమైన వాటిని చేపట్టటానికి నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. 

తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతో మంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్త పని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు.    

(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!)

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)