ప్రసవమైన ఆరువారాలకే రన్‌వేపై రీఎంట్రీ..!

Published on Fri, 10/23/2026 - 12:12

ప్రసవం జరిగిన ఆరువారాలకే విక్టోరీయా సీక్రెట్‌ రన్‌వేపై నడిచింది హంగేరియన్‌కి చెందిన మోడల్‌ బార్బరా పాల్విన్‌. పైగా ర్యాంప్‌పై సర్వాంగ సుందరీలా తళుక్కుమంది. ప్రసవమైన కొద్దిరోజులకే ఇలా ఎలా వచ్చిందని అందరు ఒకటే చర్చించుకుంటున్నారు. చెప్పాలంటే ఆ అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోలో ఆమె ఒక చర్చనీయాంశంగా మారింది. పైగా అంతా ఆమె మాతృత్వపు గ్లామర్‌ వెనుకున్న సీక్రెట్‌ ఏంటి అని చర్చించడం మొదలుపెట్టారు నెట్టింట. 

కానీ ఈ 33 ఏళ్ల సూపర్‌ మోడల్‌ పాల్విన్‌ మాత్రం ప్రసవానంతరం ఇలా తిరిగి రన్‌వేపైకి రావడం పట్ల గర్విస్తున్నాని పేర్కొంది. తనకు కుమార్తె సిల్వీ సెప్టెంబర్‌ 7, 2026న పుట్టిట్లు వెల్లడించింది. అంటే కేవలం ఆరు వారాలకే ప్రపంచంలోని అతిపెద్ద లోదుస్తుల బ్రాండ్‌లలో ఒకటైన విక్టోరియాస్ సీక్రెట్ కోసం ర్యాంప్‌పై నడిచి అందర్నీ విస్తుపోయేలా చేసింది. 

ఇలా ఆరువారాల తర్వాత పనికి వెళ్లడం అమెరికాలో ఇదేమంత పెద్ద విషయం కాదని కొట్టిపారేస్తోందామె. పైగా తాను హెల్దీగానే ఉన్నానని అంటోందామె. విక్టోరియాస్ సీక్రెట్ బృందం తనని షోకి ఆహ్వానించడంతో ఇలా ర్యాంప్‌పై మెరిశానని పేర్కొంది. ఇదొకరకంగా మహిళలకు మద్దతు ఇచ్చినట్లు అవ్వడమే కాకుండా స్ఫూర్తినిస్తుందని చెబుతోంది పాల్విన్‌. జస్ట్‌ ఆరువారాలకే రీ ఇంట్రీ ఇచ్చినప్పటికీ..తను అంత ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ఉన్న మాతృత్వపు గ్లామర్‌ రహస్యం గురించి కూడా మాట్లాడింది.

ఒక పని జరగాలంటే అందరి సహకారం కావాలి. అలాగు తను ఇంత ధైర్యంగా ర్యాంప్‌పై ఆత్మవిశ్వాసంగా రీ ఇంట్రీ ఇవ్వగలిగానంటే అందుకు తన కుటుంబం, స్నేహితులే కారణమని సగర్వంగా చెప్పింది. వాళ్లు లేకపోతే ఇంత అద్భుతంగా చేయగలిగేదాన్ని కాదంటోంది. ఆ సహాయాన్ని ఎన్నటికీ మరువనని భావోద్వేగంగా చెప్పింది పాల్విన్‌. ప్రసవానంతరం తన పరిస్థితిని అర్థం చేసుకుని తనను అందంగా ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేసిన సదరు ఫ్యాషన్‌ షో విక్టోరియస్‌ సీక్రెట్‌కు కూడా ధన్యవాదాలు తెలిపింది పాల్విన్‌. 

ఆరువారాలకే రావడానికి రీజన్‌..
ఇది తను అదృష్టవశాత్తు తీసుకున్న నిర్ణయమని అంటోంది ఈ మోడల్‌. ఈ అవకాశానికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే గాక తనలాంటి అవకాశం రాని తల్లుల గురించి కూడా ఆలోచిస్తున్నానని పేర్కొంది. అందుకే ఆ క్షణం తనకెంతో గర్వకారణమని అంటోంది. అయితే అమెరికాలో మాత్రం ఇది సర్వసాధారణమని తేలిగ్గా కొట్టిపారేస్తోంది. 

అయితే మాతృత్వం అనేది కష్టతరమైనది, గందరగోళానికి గురి చేసిది, భావోద్వేగాలతో కూడుకున్నది అయినప్పటికీ ఇది అత్యంత విలువైనది అని అభివర్ణించింది. మనం తల్లులుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ మళ్లీ తిరిగి ఉద్యోగంలోకి రావడం అన్నది మాములు విషయం కాదు అత్యద్భుతమైనది అని భావోద్వేగంగా చెబుతూ తన సంభాషణను ముగించింది .

ఇదీ చదవండి: థర్మాకోల్ బాక్స్‌తో ఏసీ..! ఆ స్టూడెంట్‌ ఆవిష్కరణకు హర్ష్ గోయెంకా ఫిదా!

 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)