Breaking News

స్టూడెంట్‌ మైండ్‌ బ్లాక్‌ స్పీచ్‌..! ఫిదా అవ్వాల్సిందే..

Published on Sun, 03/16/2025 - 13:26

ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్‌ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..

పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అభిస్కర్‌ రౌత్‌ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. 

ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్‌ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున​  నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్‌ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. 

మనకు జన్మనిచ్చిన ఈనేపాల్‌ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్‌ రౌత్‌. 

ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్‌ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్‌ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు.  కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. 

 

(చదవండి: ఆన్‌లైన్‌ ఫుడ్‌ క్రేజ్‌..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..)

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)