Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!
Published on Sun, 12/07/2025 - 13:05
మనల్ని సంతోషపరచడానికి పెద్ద పెద్ద విజయాలే అక్కర్లేదు. చిన్న చిన్న సందర్భాలు కూడా కారణం అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ ఉదాహరణ. మోడల్ నవ్య క్రిష్ణ తల్లిదండ్రులు తొలిసారిగా తమ కూతురి ఇమేజెస్‌ను బిల్‌బోర్డ్‌పై చూసి ఎంతో సంతోషించారు.
నవ్య తల్లిదండ్రుల ఎక్స్‌ప్రెషన్‌లను ఈ వీడియో స్లోగా రికార్డ్ చేసింది. బిల్‌బోర్డ్‌పై కనిపించిన కూతురి ఫొటోగ్రాఫ్‌ని చూసి... ‘ఇది నిజమేనా? మన అమ్మాయేనా!!’ అన్నట్లుగా చూశారు. ఆ తరువాత వారి సంతోషానికి అవధి లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వారి రియాక్షన్ తాలూకు వీడియో క్లిప్ నెటిజనులకు తెగనచ్చేసింది.
‘నా చిత్రాలు ఎన్నో బిల్‌బోర్డ్‌లపై కనిపించినప్పటికీ... ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఒకింత గర్వంతో, ఆనందంతో మెరిసిపోయే వారి కళ్లు నాకు అపురూపం’ అని తన పోస్ట్‌లో రాసింది నవ్య క్రిష్ణ. ‘పిల్లలు విజయాలు సాధించినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో కనిపించే మెరుపు వెల కట్టలేనిది!’ అని స్పందించారు ఒక యూజర్.
(చదవండి: Bhavitha Mandava: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..)
Tags : 1