Breaking News

‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్‌’ ఇది! ఆసక్తికరమైన వీడియో

Published on Fri, 08/30/2024 - 11:47

పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన ‍ కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేశారు.  

చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది,  కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్‌ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్‌బాల్ గోల్‌ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్‌ బాల్‌ క్రీడ ద్వారా‌ బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.

బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం  కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.  దాదాపు 7లక్షల మంది బాలికలకు  సాయం అందించినట్టు  నన్హీ కాలీ  వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)