Breaking News

నూడుల్స్‌ తినడమే ఒక గేమ్‌!

Published on Sun, 09/14/2025 - 06:41

చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్‌లోని ‘నాగాషి సోమెన్‌’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. 

ఈ సమయంలో జపాన్‌ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్‌’ నూడుల్స్‌ని రుచి చూస్తుంటారు. జపనీస్‌ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్‌’ అంటే సన్నని నూడుల్స్‌ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్‌ నూడుల్స్‌ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్‌స్టిక్‌లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్‌ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్‌ సాస్‌లో ముంచుకుని తింటారు. ఈ సాస్‌ నూడుల్స్‌కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్‌ ఉపశమనం ఇస్తాయట. 

నాగాషి సోమెన్‌ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్‌ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. 

ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్‌ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్‌ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్‌ ఒక గులాబీ రంగు నూడుల్‌ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. 

(చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్‌కి నిర్వచనం ఈ దంపతులు..!)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)