Breaking News

వయసులో ఫిట్‌..పరుగులో హిట్‌..!

Published on Tue, 12/16/2025 - 11:06

ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్‌లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్‌లు, అల్ట్రా మారథాన్‌లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్‌ మారథాన్‌ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ రన్నర్‌ నాగభూషణరావు చలమలశెట్టి..

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్‌లోని కేఎల్‌ రెడ్డి నగర్‌లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు. 

అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్‌ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్‌లలో నిలబెట్టేలా చేసింది.

ఇది ఆయన రికార్డు..
ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్‌లతో పాటు లోనావాల నైట్‌ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్‌ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్‌ మారథాన్‌ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్‌ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్‌ మారథాన్‌లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.

వచ్చే ఏడాది బోస్టన్‌ మారథాన్‌కు..
ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్‌ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న 130వ బోస్టన్‌ మారథాన్‌కు అర్హత సాధించారు. భారత్‌ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలవనున్నారు. 

 

(చదవండి: పర్యావరణ హిత మష్రూమ్‌ ఫర్నీచర్‌..! జస్ట్‌ 180 రోజుల్లోనే..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)