Breaking News

తక్కువ పెట్టుబడి.. భారీ లాభాలు.. పుట్టగొడుగుల సాగుతో జాక్‌పాట్!

Published on Fri, 11/13/2026 - 09:20

సంప్రదాయ పంటలతో పాటు తక్కువ స్థలం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా పుట్టగొడుగుల (మష్రూమ్‌) సాగు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. పోషకాహారంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో పాటు వ్యవసాయ వ్యర్థాలైన వరి గడ్డి వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, గ్రామీణ యువత ఈ రంగం వైపు ఆకర్షితులవుతున్నారు.

కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు), జాతీయ ఉద్యానవన మిషన్, ఇతర ప్రభుత్వ సంస్థల సాంకేతిక శిక్షణ, ఆర్థిక తోడ్పాటుతో సామాన్య రైతులు సైతం విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు.

యువతి స్ఫూర్తిదాయక ప్రస్థానం
దూరదర్శన్‌ సమాచారం ప్రకారం.. ఇప్పటం గ్రామానికి చెందిన 20 ఏళ్ల రుతు ఒకప్పుడు చెత్త ఏరుకుంటూ జీవనం సాగించేవారు. గ్రామీణ యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా కేవీకేలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ పొందారు.

కంపోస్ట్‌ తయారీ, విత్తనం(స్పాన్‌) కలపటం, తేమ నియంత్రణ వంటి మెలకువలు నేర్చుకొని మిల్కీ మష్రూమ్స్‌ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 8 కిలోల దిగుబడి సాధిస్తూ నెలకు రూ. 35,000 ఆదాయం ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా తన గ్రామంలోని మరికొందరికి శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇంజనీరింగ్‌ వదిలి..
గుజరాత్‌లోని తాపి జిల్లాకు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ అంజనాబెన్‌ గామిత్‌ 2017లో కేవీకే శిక్షణ తర్వాత చిన్న వెదురు షెడ్డులో పుట్టగొడుగుల సాగు చేపట్టారు. తొలి పంటలోనే రూ. 11 వేల ఖర్చుతో రూ. 28 వేల ఆదాయం పొందారు. ఆ ఉత్సాహంతో షెడ్డును విస్తరించి 1,234 కిలోల దిగుబడితో రూ. 2.20 లక్షల నికర లాభం గడించారు. చిన్న ΄్యాకెట్లలో ΄్యాకింగ్‌ చేసి స్థానిక మార్కెట్లు, అంగన్‌ వాడీల ద్వారా విక్రయిస్తూ మార్కెటింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు.

గ్రామాన్నే మార్చిన ‘మష్రూమ్‌ మహిళ’
బిహార్‌లోని నలంద జిల్లా అనంత్‌పూర్‌ గ్రామానికి చెందిన అనితా దేవి 2010లో కేవీకే సహకారంతో ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగుల సాగు మొదలుపెట్టారు. ఆమె స్ఫూర్తితో గ్రామంలోని మహిళలంతా ఈ సాగు చేపట్టటంతో 2012లో ఆ గ్రామాన్ని ప్రభుత్వం ‘మష్రూమ్‌ విలేజ్‌’గా ప్రకటించింది. జాతీయ ఉద్యానవన మిషన్‌ కింద రూ. 15 లక్షల రాయితీతో విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అనిత, రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా 250 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

రోజుకు ఒక టన్ను ఉత్పత్తి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ కు చెందిన ఐటీ ఉద్యోగిని హిరేషా వర్మ 2013లో కేవలం రూ. 2,000 పెట్టుబడితో 25 బ్యాగులతో సాగు ప్రారంభించారు. నేడు ‘హాన్‌ ఆగ్రోకేర్‌’ పేరుతో ఏసీ గదులు, ఆధునిక సాంకేతికతతో రోజుకు ఒక టన్ను పుట్టగొడుగులు ఉత్పత్తి చేస్తూ 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

పుట్టగొడుగులతో పచ్చళ్లు, బిస్కెట్లు, సూప్‌ పౌడర్‌ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు 2,000 మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారు. అలాగే, బాగేశ్వర్‌ జిల్లాకు చెందిన మదన్‌ మోహన్‌ పోర్టబుల్‌ పాలీహౌస్‌ ద్వారా ఆఫ్‌–సీజన్‌ లో బటన్‌ మష్రూమ్స్, కూరగాయలు పండించి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు.

సరైన శిక్షణ, నాణ్యమైన విత్తనం, స్థానిక మార్కెట్‌ అనుసంధానం ఉంటే పుట్టగొడుగుల సాగు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కీలక ఆదాయ వనరుగా నిలుస్తుందని ఈ విజయాలు నిరూపిస్తున్నాయి.

విజయగాథ
నైరుతి ఢిల్లీలోని హసన్‌ పూర్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ విజయవంతంగా పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు. ఈయన తన క్షేత్రంలో ఏటా సుమారు 54,000 కిలోల పుట్టగొడుగులను సాగు చేస్తూ, రూ. 21,60,000 నికరాదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో ర్యాక్‌లపై బెడ్స్‌ ఏర్పాటు చేసి పుట్టగొడుగుల పెంపకం, కంపోస్ట్‌ తయారీపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇంటింటా పుట్టగొడుగుల సాగుకు ‘రెడీ టు ఫ్రూట్‌’ బ్యాగ్‌లు!
స్థలం, సాంకేతిక నైపుణ్యం, వనరుల కొరత ఉన్న పట్టణ, గ్రామీణ ఇళ్లలోనూ సులభంగా పుట్టగొడుగులు పెంచుకునేందుకు బెంగళూరులోని భారత ఉద్యాన పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌–ఐఐహెచ్‌ఆర్‌) ‘రెడీ టు ఫ్రూట్‌’ మష్రూమ్‌ బ్యాగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది. వరిగడ్డిని శుద్ధి చేసి, పుట్టగొడుగు విత్తనం (స్పాన్‌) కలిపి, పూర్తిగా సిద్ధం చేసిన సంచులను విక్రయిస్తారు.

ఆ సంచులను వినియోగదారులు ఇంటికి తెచ్చుకుని, గదిలో పెట్టుకొని, అవసరం మేరకు నీరు చల్లుతూ పెంచితే కొద్ది రోజుల్లోనే పుట్టగొడుగులు ఇంట్లోనే పెరుగుతాయి. కేవలం రూ.40–60 ధరలోనే లభించే ఒక్కో 1–2 కిలోల బ్యాగ్‌ ద్వారా.. 600–800 గ్రాముల తాజా ఎల్మ్‌ ఆయిస్టర్‌ పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. శిక్షణ పొందిన యువతకు ఈ బ్యాగ్‌ల తయారీపై ఐఐహెచ్‌ఆర్‌ ఇంక్యుబేషన్‌ సదుపాయం, మార్కెటింగ్‌ సహకారం అందిస్తోంది.

పుట్టగొడుగుల సాగు గ్రామీణుల ఆర్థిక భద్రతకు, కుటుంబ పోషణకు, అదనపు ఆదాయానికి మార్గాలను చూపేందుకు దోహదపడుతుందని ఐఐహెచ్‌ఆర్‌ చెబుతోంది. ఈ సంస్థ ‘రెడీ టు ఫ్రూట్‌’ మష్రూమ్‌–బ్యాగ్‌ టెక్నాలజీని ఉపయోగించి 5,000 మందికి పైగా మహిళలు తమ ఇళ్లలోనే పుట్టగొడుగులను సాగు చేసేందుకు వీలు కలిగిందని ఐఐహెచ్‌ఆర్‌ 
తెలిపింది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు