Breaking News

'మా నాన్న గ్రాడ్యుయేట్‌'..!

Published on Tue, 09/09/2025 - 12:39

అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్‌ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ​ నెట్టింట తెగ వైరల్‌గా మారింది 

52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్‌ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్‌ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్‌ప్రైజ్‌కి ఉబ్బితబ్బిబైపోయాడు. 

తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్‌ క్యాప్‌ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్‌ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి. 

అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్‌ఫుల్‌ సందేశాల నోట్స్‌ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్‌' అనే క్యాప్షన్‌ జత చేసి మరి పోస్ట్‌ చేశాడు. 

ఆన్‌లైన్‌లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్‌లో ఫోజులిచ్చే ఛాన్స్‌ని కొట్టేయొచ్చు కదూ..!

 

(చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!)

 

#

Tags : 1

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)