Breaking News

దేశంలోనే రిచెస్ట్‌ గణపతిగా రికార్డు, భారీ బీమా

Published on Wed, 08/27/2025 - 11:28

ముంబైలో GSB సేవా మండల్  ఏర్పాటు చేసిన అత్యంత సంపన్నమైన గణేష్ విగ్రహం విశేషంగా నిలుస్తోంది.  ఈ  ఏడాది గణపతి  నవర్రాతి వేడుకలకు సంబంధించి  తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీంతో ముంబైలో పండుగ ఉత్సాహం మిన్నంటింది. ఈ అద్భుతమైన విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇది నిజంగా "విరాట్ దర్శనం" అని అభివర్ణించారు భక్తులు. అంతేకాదు ఈ ఏడాది గణపతి విగ్రహం  భారతదేశంలోనే అత్యంత ధనిక గణపతి విగ్రహంగా రికార్డు క్రియేట్‌ చేసింది.

గణేష్ చతుర్థి 2025 వేడుకలు
GSB సేవా మండల్ గణపతి వేడుకలు ఆగస్టు 27న సియోన్‌లోని కింగ్స్ సర్కిల్‌లో ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. పలు నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం విగ్రహం 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు. ఇది ముంబైలో అత్యంత సంపన్నమైన గణపతిగా నిలిచింది. అంతేకాదు దీనికి గట్టి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం విశేషం. 

అలాగే GSB సేవా మండల్ తన 71వ గణేష్ ఉత్సవాలకు రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల భీమా కవరేజీని కూడా పొందింది. ఇదీ ఓ రికార్డే. ఇందుల దాదాపు రూ. 375 కోట్లు పూజారులు, స్వచ్ఛంద సేవకులు, వంటవారు, భద్రతా సిబ్బంది , పండల్ చుట్టూ ఉన్న చిన్న సేవా స్టాళ్లలో పనిచేసేవారికి వ్యక్తిగత ప్రమాద బీమాకు కేటాయించబడింది. ఈ పాలసీలో అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక ప్రమాదాలు , డిజిటల్ ఆస్తుల నుండి రక్షణ కూడా ఉంది. అదనంగా రూ. 30 కోట్లు ప్రజా బాధ్యతను కవర్ చేస్తాయి, భక్తులకు భద్రతా ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 

ఇదీ చదవండి: Vinayaka Chavit​hi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలు

గణపడి ఆభరణాల కోసమే రూ. 67.03 కోట్ల బీమా ఉంది. గత ఏడాది గణేష్‌ మంటపానికి అందించిన మొత్తం భీమా రూ. 400.58 కోట్లుగా ఉంది, ప్రస్తుతం ఆ రికార్డును ఆ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. భక్తుల కోసం  భద్రత నిమిత్తం మూడు షిఫ్టులలో 875 మంది సిబ్బంది, 100 కి పైగా CCTV కెమెరాలు, AI-ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు మరియు మెటల్ డిటెక్టర్ గేట్లను మోహరించింది.  1954లో స్థాపించబడిన GSB సేవా మండల్ ముంబైలోని గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా భారీ విరాళాలు అందుతాయి.

చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్‌ వీడియో వైరల్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)