Breaking News

బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్‌ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!

Published on Fri, 08/07/2026 - 16:39

ఒక్కోసారి కొన్ని జీవిత పాఠాలు..కొన్ని ప్రయాణాల్లో ఊహించని విధంగా తెలుసుకుంటాం. మరికొన్ని మనకన్న వయసులో చిన్న వాళ్లైనా యువత నుంచి నేర్చుకుంటుంటాం. అలాంటి గొప్ప జీవిత పాఠాన్నే ఒక ఉబర్‌ రైడర్‌ నుంచి నేర్చుకున్నాడు ఓ వ్యాపారవేత్త. 

అసలేం జరిగిందంటే..ముంబై వ్యాపారవేత్త ఆఫీస్‌ నుంచి ఇంటి వెళ్లేందుకు రైడ్‌ బుక్‌చేసుకున్నాడు అప్పుడు ఎదురైన అనుభవాన్ని లింక్డ్‌ని పోస్ట్‌లో పంచుకున్నారు. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో రాత్రి 8.25 గంటలకు రైడ్‌ ఖరారైందని తెలిపారు. తనను తీసుకువెళ్లడానికి బీఎండబ్ల్యూ బైక్‌ రావడం చూసి విస్తుపోయానని అన్నారు. ఆ రైడర్‌ రాగానే బ్రో మీరెందుకు ఉబర్‌ నడుపుతున్నారని ప్రశ్నించినట్లు చెప్పారు. దాని ఆ రైడర్‌ ఇచ్చిన సమాధానం..తనకు గొప్ప స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నేర్పిందంటూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. 

ఆ రైడర్‌తో వ్యస్థాపకుడు జైన్‌తో సార్‌ ఇదే నా మొట్టమొదటి ఉబర్‌ రైడ్‌ అని చెబుతూ ఇది తాను డబ్బు కోసం చేయడం లేదని అన్నారు. అతను కొత్త వ్యక్తులను కలవాలని, సంభాషణలు ప్రారంభించాలని, విభిన్న దృక్కోణాలను అర్థంచేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే తన కథను కూడా పంచుకున్నట్లు తెలిపారు. తాను ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అని, వివిధ వ్యాపారాలు ప్రయత్నించినట్లు తెలిపాడన్నారు. అయితే కొన్ని డబ్బులు సంపాదించి పెట్టగా, మరికొన్ని జీవిత పాఠాలను నేర్పించాయన్నారు. 

ప్రస్తుతం తాను కొత్త అవకాశాలను అన్వేషిస్తూ..మాస్టర్‌ డిగ్రీ చేయాలని చూస్తున్నట్లు చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత తాను కుతూహలంతో మరీ ఈ బీఎండబ్ల్యూ బైక్‌ గురించి అని ప్రశ్నించగా..అతడు చిరునవ్వుతో తన వ్యాపారాల ద్వారా సంపాదించిన కొంత సొమ్ము, అలాగే పేరెంట్స్‌ ఇచ్చిన కొద్దిపాటి సాయంతో దీన్ని కొన్నట్లు తెలిపాడు. ఆ విషయాన్ని కూడా అతడు చాలా సింపుల్‌గా చెప్పాడని అన్నారు. 

తన రైడ్‌ మగిశాక..అతడు తనకు ప్రజలతో కలిసి పనిచేయడం ఇష్టం అని, ఈవెంట్‌లు నిర్వహిడం తనకు సంతోషన్ని ఇస్తుందని చెప్పాడు. బదులుగా మిత్రమా మీ జర్నీలో అన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నానంటూ తన సంభాషణను ముగించినట్లు తెలిపారు. ఆయన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒక వాక్యం తన మదిలో అలాగే నిలిచిపోయిందన్నారు. 

"మీ కలలను వెంబడించే ధైర్యం, ఉత్సాహం మీకు ఉన్నంత వరకు, పెద్ద కలలు కనడంలో ఎలాంటి నష్టం లేదు.” అని అన్నారు. ఒక్కోసారి ఇలాంటి స్ఫూర్తి ఒక సీఈవో, పారిశ్రామికవేత్త, బెస్ట్‌ సెల్లింగ్‌ రచయితల పుస్తకాల ద్వారా రాదు అంటూ పోస్ట్‌ని ముగించారు. కాగా,  ఆశీష్ జైన్ తన కెరీర్‌ను ఎయిర్‌టెల్‌లో ప్రారంభించారు. ఏళ్లుగా అతను విప్రోతో సహా వివిధ సంస్థలలో పనిచేశారు. ఆయన 2012లో తన సొంత కంపెనీని ప్రారంభించారు.

(చదవండి: అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ ..కానీ జీతం రూ. 960!)
 

#

Tags : 1

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)