వేటకొడవలితో వీరంగం.. బావపైకి కత్తి ఎత్తిన మరదలు..
మౌన్ జారో పెళ్లికూతురు
Published on Sat, 04/18/2026 - 05:59
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్‌నెస్ క్లినిక్‌లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.
అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్‌లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.
‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్‌నెస్ క్లినిక్‌లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
ఎందుకు ఈ ట్రెండ్?
పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్‌తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.
ప్యాకేజీల్లో ఏముంది?
ఢిల్లీలోని క్లినిక్‌లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్‌లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్‌కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
వైద్యుల హెచ్చరిక
అనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నా రూపమే నా సౌందర్యం
ఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్‌నెస్ క్లినిక్‌ల బారిన పడొద్దు.
పెళ్లిలో బాగా కనిపించాలని..
ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్‌కు అద్దం పడుతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్‌లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్‌లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది.
Tags : 1