Breaking News

అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..

Published on Tue, 08/12/2025 - 14:02

సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం.  ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్‌ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . 

అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్‌(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్‌(Jameka Mauldin) అనే సింగిల్‌ మదర్‌ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్‌ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. 

చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. 

అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు.  

సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..
ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్‌కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్‌ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్‌ చేసుకునేది. 

దాంతోపాటు ఫిజికల్‌ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్‌ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్‌లు, ఖరీదైన జిమ్‌లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యింది కూడా. 

తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.

(చదవండి: చాట్‌జీపీటీ ఆధారిత డైట్‌తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)