Breaking News

బ్యూటీకి కేరాఫ్‌గా భాగ్యనగరం..!

Published on Sun, 05/25/2025 - 16:35

ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్‌ నగరం పాతికేళ్లకు ముందే ఈ పోటీల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది. దేశానికి విశ్వసుందరి, ప్రపంచ సుందరి రెండు కిరీటాలనూ అందించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది.  

హేడెన్‌ హైదరాబాదీయే.. 
నగరానికి చెందిన ఆంగ్లో–ఇండియన్‌ కుటుంబంలో 1973వ సంవత్సరం మే 13న జని్మంచిన డయానా హేడెన్‌.. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైసూ్కల్‌లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె 13 సంవత్సరాల వయసులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నగరంలో ఆమె మోడలింగ్‌ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎన్‌ కోర్‌ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో పనిచేశారు. 

అనంతరం గ్లామర్‌ రంగంలో అడుగుపెట్టి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యారాయ్‌ దక్కించుకున్న తర్వాత 3వ సారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్‌ దక్కించుకున్నారు.  అంతేకాదు హైదరాబాద్‌ను కూడా చరిత్రకు ఎక్కించారు. ఈ 1997 మిస్‌ వరల్డ్‌ పోటీ విజేత మెయిన్‌ టైటిల్‌తో పాటు మూడు సబ్‌–టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. అలా గెలిచిన ఏకైక మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ హోల్డర్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా, టీవీ రంగంలో ఆమె స్థిరపడ్డారు.

విశ్వసుందరిని అందించిందీ మనమే..
మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దేశానికి అందించిన సుషి్మతాసేన్‌ కూడా హైదరాబాదీనే. ఆమె 1975వ సంవత్సరంలో నవంబర్‌ 19న నగరంలోని బెంగాలీ బైద్య కుటుంబంలో జన్మించారు. భారత వైమానిక దళం మాజీ వింగ్‌ కమాండర్‌ షుబీర్‌ సేన్, ఆభరణాల డిజైనర్‌ అయిన సుబ్ర సేన్‌లు ఆమె తల్లిదండ్రులు.

 సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. అనంతరం 1994లో మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచి, బాలీవుడ్‌లో స్థిరపడి పలు హిందీ చిత్రాల్లో పనిచేశారు. నగరంలో తాను స్థాపించిన ఐయామ్‌ షి పోటీల సందర్భంగా పలుమార్లు ఆమె నగరాన్ని సందర్శించారు.  

(చదవండి: 44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్‌ ఏంటంటే..)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)