Breaking News

Miss World 2025: హెరిటేజ్‌ వాక్‌కు సర్వం సిద్ధం..

Published on Mon, 05/12/2025 - 07:30

చార్మినార్‌: పాతబస్తీలో మిస్‌ వరల్డ్‌ సుందరాంగులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌–2025లో పాల్గొంటున్న పోటీదారులతో ఈ నెల 13న చారి్మనార్‌లో హెరిటేజ్‌ వాక్‌ జరగనుంది. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్‌ వాక్‌లో పాల్గోనున్నారు. చారి్మనార్‌ నుంచి లాడ్‌ బజార్‌ వరకూ నిర్వహించే వాక్‌లో కంటెస్టెంట్స్‌ ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. పాతబస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్‌ బజార్‌లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.    

హెరిటేజ్‌ వాక్‌ సందర్భంగా పాతబస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చారి్మనార్‌ కట్టడాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. పర్యాటకులు చారి్మనార్‌ వద్ద సెల్పీలు దిగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌గంజ్‌ ద్వారా పాతబస్తీకి ప్రవేశించే నయాపూల్‌ బ్రిడ్జిపై కొత్తగా మొక్కలతో అలంకరించారు. 

 

రిహార్సల్స్‌ పూర్తి.. 
నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పర్యవేక్షణలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకూ హెరిటేజ్‌ వాక్‌ రిహార్సల్స్‌ జరిగాయి. పోలీసు, పర్యాటక, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, ఆర్కియాలజీ, జలమండలి.. ఇలా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్‌ ఆనా..అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో మిస్‌ వరల్డ్‌–2025 అభ్యర్థులను తరలించనున్నారు. శివారు ప్రాంతమైన ఆరంఘర్‌ నుంచి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఫ్లైఓవర్‌ ద్వారా పాతబస్తీకి ప్రవేశించి బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్‌ ద్వారా చారి్మనార్‌కు చేరుకోనుంది.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)