Breaking News

మేయర్‌గా మమ్దానీ: తల్లి తొలి స్పందన

Published on Wed, 11/05/2025 - 13:03

ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్  (Mira Nair) తన కుమారుడు  జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి ‍స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌ నెట్టింట సందడి చేస్తోంది.

కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్‌ దర్శకురాలు జోయా అక్తర్‌ ఇన్‌స్టా పోస్ట్‌ను షేర్‌ చేశారు. హార్ట్‌,  బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో  ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. 

అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్‌ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు.  

కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్‌ మమ్‌దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్‌ హైసూ్కల్‌ ఆఫ్‌ సైన్స్‌తోపాటు బౌడిన్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు.  2017లో డెమొక్రటిక్‌ సోషలిస్టు ఆఫ్‌ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్‌ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.  తాజాగా న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్‌ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

 

Videos

బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)