Breaking News

ఇంత పక్కా రిటైర్మెంట్‌ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..

Published on Wed, 05/27/2026 - 14:20

ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్‌ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్‌ ప్లాన్‌ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్‌ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.

రేమండ్‌ జెంగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్‌ రెండేళ్లపాటు డల్లాస్‌లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్‌లు, స్టాక్‌లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు. 

అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్‌లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్‌గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్‌ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు. 

అయితే జెంగ్‌ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్‌ స్పెడ్‌షీట్‌ని మెయింటైన్‌ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్‌ చేసుకుంటాడట. అంటే జాంగ్‌ అనుకున్న ప్రకారం.. ప్లాన్‌ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్‌ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్‌ స్ట్రాటజీ.

(చదవండి: టెన్త్‌ డ్రాపౌట్‌..ఆయుధాలు, డ్రోన్‌ సాంకేతికత అందించే కంపెనీ..!)
 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)