Breaking News

స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్‌ స్టోరీ వైరల్‌!

Published on Mon, 03/31/2025 - 16:16

గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్‌కే, ఆర్ఆర్  మధ్య జరిగిన ఐపీఎల్‌  మ్యాచ్‌లో బాలీవుడ్ నటి మ‌లైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెట‌ర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర‌ (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇటీవ‌లే అర్జున్ క‌పూర్‌కు బ్రేకప్‌ చెప్పిన మ‌లైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్‌ స్టోరీ  ఆసక్తికరంగా మారింది.

కుమార్ సంగక్కరగా పాపులర్‌ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్‌ చరిత్రలో లిఖించు కున్నాడు.   

చదవండి: ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి

అనూహ్యంగా క్రికెట్‌ కరియర్‌లోకి
1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్‌లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి  ఎక్కువ.  ఈ  ఆసక్తితోనే  తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్‌గా,  శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్‌లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం  ఉన్నప్పటికీ  పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్‌పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర  1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్‌లోకి  ఎంట్రీ ఇచ్చాడు.  1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్‌ క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా  ఉన్నాడు.  2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్‌కు  చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ,   తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్‌ హాఫ్‌ అని చెప్పవచ్చు.

(సమ్మర్‌ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్‌ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)

ప్రేమకథ ఎలా మొదలైందంటే
సంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్‌ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్‌వుడ్ కాలేజీలో చదువుకుంది.  ఇది పూర్తిగా బాలికల పాఠశాల.  ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది.  అయితే  కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్‌తో  సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.

సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల  భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం  అంటే ఆసక్తి. అందమైన  కవిత్వంతో యెహాలి  పట్ల ప్రేమను  చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు.  కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 

2003లో  ఈ ప్రేమపక్షులు  వివాహ  బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్‌ ఫ్రెండ్స్‌ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్‌లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం  భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది.  వీడ్కోలు సిరీస్‌లో కూడా ఆమె  ఉంది. 

కాగా  కుమార్‌ సంగక్కర్‌ ఐపీఎల్‌ స్టార్‌ ప్లేయర్‌గా  త‌న‌దైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవ‌న్‌ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్ర‌స్తుత సీజ‌న్‌కు ముందు వ‌ర‌కు ఆ టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న విష‌యం తెలిసిందే.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)