Breaking News

బరువు తగ్గడంలో పురుషులే ఫాస్ట్‌!

Published on Sat, 07/25/2026 - 08:13

బరువు తగ్గే విషయంలో పురుషులకు, మహిళలకు పోటీ పెడితే.. విజేతలుగా నిలిచేది మగాళ్లే. ఔనండి.. మహిళల కంటే పురుషులే త్వరగా బరువు తగ్గుతారట. స్త్రీ, పురుషులిద్దరు ఒకే షెడ్యూల్‌లో ఒకే డైట్, ఒకే వ్యాయామం పాటించినా సరే.. పురుషులే వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ విషయంలో మహిళల తప్పిదం ఏమీ లేదు. ఇందుకు కొన్ని జీవ సంబంధిత కారణాలు ఉన్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. పురుషులు బరువును కోల్పోవడంలోనే కాదు.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనట. మరి, పురుషులే త్వరగా బరువు తగ్గేందుకు గల కారణాలేమిటో చూద్దామా!

బరువు తగ్గించడమంటే.. శరీరంలోని క్యాలరీని కరిగించడమే. అసలు విషయం ఏమిటంటే.. ఇతరులతో పోల్చితే ఎక్కువ సన్నని కండరాలు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్‌ చేయడానికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచాలంటే మహిళలు.. పురుషులు కంటే ఎక్కువసేపు శ్రమించాల్సి ఉంటుంది.


బరువు తగ్గడంలో జీవక్రియ కూడా భారీ పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియ కూడా సన్నని కండరాల వల్లే ప్రభావితమవుతుంది. పురుషులు ఎక్కువ సన్నని కండరాలను కలిగి ఉన్నందున వారు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఫలితంగా మహిళలతో పోలిస్తే వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

పురుషులు, మహిళల్లో వేర్వేరు ్రపాంతాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇది కూడా ఇరువురి బరువులపై ప్రభావం చూపుతంది. పురుషులకు ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. మహిళలకు తొడలు, పిరుదుల్లో కొవ్వు పెరుగుతుంది. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వుతోనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం. అయితే, దీన్ని కరిగించడం సులభమే. తక్కువ వ్యాయామంతోనే త్వరగా 
పొట్టను తగ్గింవచ్చు.

రోజూ ఎంత సేపు నడిస్తే మంచిదంటే..
హార్మోన్ల వల్ల కూడా స్త్రీలు.. పురుషులు కంటే ఆలస్యంగా బరువు తగ్గుతారు. పురుషుల కంటే మహిళల్లో 6 నుంచి 11 శాతం కొవ్వు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్‌ వల్ల భోజనం తర్వాత క్యాలరీలు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ స్థాయి పడిపోతే బరువు పెరుగుతారు. పురుషులతో పోల్చితే మహిళలు తగిన డైట్‌ ΄్లాన్‌ పాటించలేరు. తమకు ఇష్టమైన ఆహారాన్ని చూడగానే కంట్రోల్‌ చేసుకోలేరు. అయితే, అత్యధిక శాతం మంది పురుషులు శ్రద్ధగా డైట్‌ పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా మహిళల కంటే వేగంగా పురుషులు బరువు తగ్గుతారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)