Breaking News

Fashion: పోగు పెట్టుకో... పోజు కొట్టుకో!

Published on Sun, 07/05/2026 - 10:06

ఒకప్పటి రాజుల ఫొటోలు చూస్తే, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపించేవారు. మధ్యలో ఏమైందో ఏమో మగవాళ్లు జ్యూలరీకి కాస్త దూరమయ్యారు. అయితే, ఇప్పుడు మెన్స్‌ ఫ్యాషన్‌ ప్రపంచం పెద్ద యూటర్న్‌ తీసుకుంది. రాజుల కుండలాలు కాస్త కూల్‌ ఇయర్‌రింగ్స్‌గా మారి కుర్రాళ్ల స్టయిల్‌కు కొత్త మెరుపు తెస్తున్నాయి. మగాళ్లను మళ్లీ మహారాజుల్లా మెరిపిస్తున్న ఈ ఇయర్‌రింగ్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం!

స్టడ్స్‌
సింపుల్‌గా ఉండాలనుకునే వారికి ఇవి బెస్ట్‌. చిన్న రాయి లేదా మెటల్‌ డిజైన్‌ తో నల్లటి చుక్కలా ఉండే స్టడ్స్‌ ఎలాంటి దుస్తులతోనైనా సెట్‌ అయిపోతాయి. సైలెంట్‌గా స్టయిల్‌ మెయింటైన్‌ చేయాలంటే స్టడ్స్‌ పెట్టుకోవాల్సిందే!

రింగ్స్‌
కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌ కావాలంటే ఇవి పర్ఫెక్ట్‌. స్పోర్ట్స్‌ బైక్‌ మీద కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని వెళ్తుంటే... ఆ రింగ్‌ గాలికి ఊగుతూ మెరుస్తుంటే.. అబ్బా, ఆ కిక్కే వేరు!  చిన్న రింగ్స్‌ నుంచి పెద్ద రింగ్స్‌ వరకు ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

డాంగ్లర్స్‌ 
ఇవి పెట్టుకుంటే స్టయిల్‌ మీటర్‌ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెవికి కిందకి వేలాడే ఇవి సాధారణ లుక్‌ను క్షణాల్లో ట్రెండీగా మార్చేస్తాయి. ముఖ్యంగా క్రాస్‌ డిజైన్లు, ఫంకీ పెండెంట్లు ఉన్న డాంగ్లర్స్‌ పూల్‌ పార్టీలు, బీచ్‌ వెకేషన్లు, వీకెండ్‌ ట్రిప్స్‌లకు, ఇవి పెట్టుకున్న వెంటనే తెలియకుండా అందంగా కనిపిస్తారు.

మ్యాగ్నెటిక్‌ పోగులు 
‘ఫ్యాషన్‌ కావాలి. కాని, సూదితో చెవి కుట్టించుకునే ధైర్యం లేదు’ అనుకునే సుకుమారుల కోసం దేవుడు సృష్టించిన, భయస్తుల బ్రహ్మాస్త్రాలు ఇవి. అంటించుకుంటే అతుక్కుంటాయి, తీసేస్తే వచ్చేస్తాయి.

పోగు పెట్టుకుంటే... స్టార్‌ అయిపోరు!
సినిమా హీరోలు, క్రీడాకారులు చెవికి పోగు పెట్టుకున్నారని చాలామంది సేమ్‌ స్టయిల్‌ ఫాలో అవుతుంటారు. అయితే, చెవి పోగు పెట్టుకున్న వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో హీరో ఇంట్రో మ్యూజిక్‌ మొదలవుతుందని మాత్రం అనుకోవద్దు! అసలు మ్యాజిక్‌ పోగులో కాదు... దాన్ని ఎలా క్యారీ చేస్తారన్న దాంట్లో ఉంది. మీ ముఖాకారం, హెయిర్‌ స్టయిల్, దుస్తులకు సరిపోయే డిజైన్‌ ను ఎంచుకుంటేనే లుక్‌ అదిరిపోతుంది.

స్కిన్‌  టోన్‌ కు తగ్గట్టు బ్లాక్, సిల్వర్‌ లేదా గోల్డ్‌ కలర్‌ను ఎంచుకోండి. కనిపించిన ప్రతీ డిజైన్‌ను ఒకేసారి ట్రై చేస్తే క్రిస్మస్‌ ట్రీలా తయారవుతారు. అలాగే మరీ బరువైన పోగులు పెట్టుకుని చెవులకు జిమ్‌ వర్కౌట్‌ ఇవ్వొద్దు. అలాగే రోజుకో పోగు, గంటకో స్టయిల్‌ మార్చేస్తే కన్‌ఫ్యూజన్‌  మీకే. మీ ఫేస్‌కు ఏది బాగా సెట్‌ అవుతుందో అదే ఫిక్స్‌ చేసుకోండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి... మీరే మీకు ఫ్యాన్‌  అయిపోతారు! - కొండి దీపిక

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)