Breaking News

నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా

Published on Tue, 06/24/2025 - 16:35

పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు.  మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు.  సాధించాలన్న పట్టుదల ఉంటే  ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు.  పదండి రమేష్‌ సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం.

'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్‌  ఘోలప్‌. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు.  కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. 

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్‌కు  జన్మించాడు రమేష్‌. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది.  అయినా  ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ  చదువులో రమేష్‌ ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే. 

12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి   కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత  దూరవిద్య ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో  ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

తన కల నిజం  చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు.  2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలు రాసి తహసీల్దార్‌ ఉద్యోగం సంపాదించాడు.    చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి  తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్‌ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో  గ్రామస్తులంతా సంభ్రమాశ్చ​ర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం  జార్ఖండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డ్రింకింగ్ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ స్పెషల్‌  సెక్రటరీగా పనిచేస్తున్నారు. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)