Breaking News

అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్‌ భళా..!

Published on Thu, 07/03/2025 - 14:41

తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్‌లైన్‌లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు  రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్‌ చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు.  

ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్‌ : గ్యాప్‌ పెరిగిపోతోంది

ఆ విజ్ఞానంతోనే..  
ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్‌లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ సైకిల్‌ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్‌కు బిగించాను.  ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ సైకిల్‌పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది.   – సిద్దూ, జె.కొత్తవలస

చదవండి: బోయింగ్‌ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్‌, కడసారి సందేశాలు

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)