Breaking News

300 లీటర్ల అమ్మపాలు దానం చేసిన అమృతమూర్తి

Published on Sat, 08/09/2025 - 11:27

పుట్టే బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చేది తల్లి పాలు. ఇదే పోషకాహారం కూడా. అందాన్ని కాపాడుకునేందుకు కొద్దిమంది తల్లులు బిడ్డలకుపాలు ఇవ్వడం మానేసిన ఈ రోజులలో తిరుచ్చికి చెందిన బృంద నెలల తక్కువతో పుట్టే బిడ్డలకు అమృత మూర్తి అయ్యారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధి స్మారక ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్‌కు 300.17 లీటర్లపాలను దానం చేసి రికార్డులోకి ఎక్కారు. తిరుచ్చి కాట్టూరుకు చెందిన సెల్వ బృంద (34) ఇద్దరు బిడ్డల తల్లి.

తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరం అని చాటే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బృంద. పసి బిడ్డల పాలిట అమృత మూర్తిగా ఉన్న సెల్వ బృంద దాన గుణానికి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆమెకు ‘అమృతం ఫౌండేషన్‌’ అండగా నిలిచింది.  ‘సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, వ్యక్తిగత కారణాల వల్ల తల్లులుపాలను దానం చేయడానికి ముందుకు రావడం లేదు. తొలి నాళ్లలో నన్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. నిరాశపరిచే మాటలు వినిపించేవి. అయినా వెనక్కి తగ్గలేదు. తల్లిపాల దానంపై అవగాహన విస్తృతం కావాలి.  పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలి’ అంటుంది సెల్వ బృంద.
– అస్మతీన్‌ మైదీన్, సాక్షి–చెన్నై

 ఇవీ చదవండి: సారా టెండూల్కర్‌ కొత్త చాలెంజ్‌ క్రియేటివ్‌ వీడియో వైరల్‌
‘స్వీట్’‌ కపుల్‌ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు


 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)