Breaking News

లిఖిత అమ్మమనసు, హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

Published on Sat, 07/26/2025 - 10:42

నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం’ అనే మాటను చాలాసార్లు విని ఉంటాం. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల వల్ల అందరు శిశువులు ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. నెలలు నిండని పిల్లలు, తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు తల్లిపాలు దొరకడం గగనమైంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది అనంతపురం నగరానికి చెందిన దర్శి లిఖిత. తాను పడిన ఇబ్బంది ఇతరులు పడకూడదని భావించిన లిఖిత పేదింటి శిశువులకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బెంగూరులో ఎలక్ట్రికల్‌ మేనేజర్‌గా పని చేస్తోంది లిఖిత. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఆమెకు బాబు పుట్టాడు. ‘మొదటి రెండు వారాల పాటు నాకుపాలు తక్కువగా వచ్చేవి. నాపాలతో పాటు డబ్బాపాలు బాబుకు పట్టేవాళ్లం. బాబు కడుపు నిండా తాగేవాడుపాలు తక్కువైన ప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న డబ్బాపాలు పట్టేదాన్ని. అయితే డబ్బాపాలు తాగించేటప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు, కొందరు వైద్యులు చెప్పిన సూచనలను, సలహాలను పాటించిన తర్వాత అదృష్టవశాత్తూ నాకు పాలు బాగా పడ్డాయి. నా బిడ్డ బొజ నింపుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలేవి. వాటిని తల్లిపాలు దొరకని చిన్నారుల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. విదేశాల్లో, బెంగళూరులాంటి ప్రాంతాల్లో మిల్క్‌ బ్యాంకుల గురించి విన్నాను. అనంతపురంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంకు ఉందని అక్క శ్రీలేఖ (గైనకాలజిస్టు) చెప్పారు. నేను పడ్డ ఇబ్బంది ఇతరుల పిల్లలు, తల్లులూ పడకూడదని, అలాంటి వారికి తల్లిపాలు అందజేయాలని నిర్ణయించు కున్నాను’ అంటుంది లిఖిత.

చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!

లిఖిత తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. ప్రోత్సహించారు. పాలను స్టోరేజ్‌ చేయడానికి ఆన్‌లైన్‌లో ΄్యాకెట్స్‌ కొనుగోలు చేస్తుంది లిఖిత. వాటిలో నుంచి తన బిడ్డకు సరిపడాపాలు ఇస్తూనే మిగిలిన పాలను రోజూ 200 మి.లీ. వరకు సేకరించి డీప్‌ ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంది. అలా నెల రోజుల పాటు సేకరించిన మొత్తం తొమ్మిది లీటర్ల పాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్‌ మిల్క్‌ బ్యాంకుకు అందిస్తోంది.‘చనుబాల దానం కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. తల్లిపాల ప్రాముఖ్యత, దానిలోని ΄ోషకాలు, రోగనిరోధక శక్తి గురించి ప్రచారం చేస్తాను’ అంటుంది లిఖిత
– ఆర్‌డీవీ బాలకృష్ణారావు,  సాక్షి, అనంతపురం

ఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
 

లిఖిత బాటలో
అనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదతల్లులు గర్భం సమయంలో రకరకాల కారణాల వల్ల సౌష్టికాహారం తీసుకోకపోవడంతో నెలలు నిండక, బిడ్డ ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పసికందులు పాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. లిఖిత ముందుచూపుతో తొమ్మిది లీటర్ల పాలు అందజేయడం సంతోషంగా అనిపించింది. వృత్తిరీత్యా బిజీగా ఉండే లిఖిత పేద పిల్లల గురించి ఆలోచించడం అభినందనీయం. ఇంకా ఎంతోమంది తల్లులు ముందుకువచ్చి పాలు ఇవ్వాలి. లిఖితను స్ఫూర్తిగా తీసుకోవాలి.– డాక్టర్‌ హేమలత,  డిప్యూటీ ఆర్‌ఎంఓ 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)