Breaking News

టాలెంట్‌ ఉండాలే గానీ.. అమెరికన్‌ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం

Published on Tue, 06/03/2025 - 17:36

బాగా  చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు  చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ  కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు.  పట్టుదల, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు.   దీనికి నిడుమోలు లక్ష్మీ నారాయణరావు దానికి ఒక ఉదాహరణ. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్‌లో  రూ. 1.45 కోట్ల  వార్షిక వేతనంలో అద్భుతమైన ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు.  చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు  తీసుకొచ్చాడు.

రూ. 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవాడు నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి.  రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో  2021-2025 బ్యాచ్‌కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన  ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక  కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.

ఇదీ చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్‌ బ్రాండ్‌..కోట్ల టర్నోవర్‌ : దోస్తుల సక్సెస్‌ స్టోరీ

మలుపు తిప్పిన ఇంటర్న్‌షిప్‌
తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు  అమెరికన్‌ కంపెనీ రుబ్రిక్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది.  రావు అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడు.. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.  రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై  ఆసక్తి  ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ (AIML)కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు.  

 చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ
 

ఇన్స్‌స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయి
BIT మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన  విద్యార్థికి  ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ  రావును అభినందించింది.  గతంలో, గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి రూ. 52 లక్షలుగా నమోదైందని  BIT మెస్రా ప్లేస్‌మెంట్  ఆఫీసర్‌ తెలిపారు. 
 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)