వాడికి భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!

Published on Mon, 04/21/2025 - 14:27

బాలీవుడ్ నటి దిశా  పటానీ  అక్క ఖుష్బూ పఠానీ  ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది.  ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట  ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్‌  ప్రపంచాన్ని ఏలుతోంటే..  ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్‌ ఎలా అయింది?    మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ  ఇంట్రస్టింగ్‌  జర్నీ గురించి తెలుసుకుందామా.

అద్భుతనటిగా,  ఫిట్‌నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ  పేరు కూడా పాపులరే.   భారతీయ  ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన  ఇపుడు బరేలీలో  పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.


1991 నవంబర్‌లో  ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ.  బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు  గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా  వెళ్లడం మానేసింది. 

చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్‌ స్టోరీ

పట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్‌సీలో జాబ్‌ సంపాదించింది  కానీ ఆ ఉద్యోగం ఖుష్బూ​​కి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి  ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి  ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో  మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్‌నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు  ఆమె TEDx స్పీకర్‌ కూడా

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు  స్ఫూర్తినిస్తోంది.  ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)