తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంక్‌, అనన్య మార్క్స్‌ షీట్‌ వైరల్‌

Published on Sun, 07/27/2025 - 13:53

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చాలామంది కలలు కంటారు. IAS, IFS, IRS లేదా IPS  అధికారి కావాలనే కలతో ప్రతీ ఏడాది వేలాది మంది ఈ పరీక్ష రాయాలని కోరుకుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే  అసాధారణ ప్రతిభతో సత్తాచాటిన అనన్యరెడ్డి మార్కుల షీట్‌  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో అనన్య మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లోనూ, హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యను పూర్తి చేసిన అనన్య ఢిల్లీలో మిరాండా హౌస్ నుండి ఎకనామిక్స్‌లో మైనర్‌తో భౌగోళిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రి పూర్తవుతున్న క్రమంలో UPSCపై దృష్టిపెట్టింది. ప్రతిరోజూ 12 నుండి 14 గంటలు చదువుకుంటూ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే  ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. తన సబ్జెక్టు ఆంత్రోపాలజీలో ప్రావీణ్యం సంపాదించడానికి కోచింగ్ తీసుకున్నారట. (చదివింది పదో తరగతే... కట్‌ చేస్తే కోట్లలో సంపాదన)

పట్టుదల దృఢనిశ్చయంతో చదవిUPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ -3ని సాధించారు అనన్యరెడ్డి.  రెండేళ్ల శ్రమతో తన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో సివిల్స్‌ సాధించడం విశేషం.  ప్రముఖ ‍క్రికెటర్‌ విరాట్ కోహ్లీ తనకు  ప్రేరణ  అని వెల్లడించారు. అంతేకాదు నవలలు చదవడం, క్రికెట్ చూడటం ద్వారా అనన్య రెడ్డి తన టెన్షన్‌ను మేనేజ్‌ చేసుకునేదట. 

ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)