Breaking News

Ajibabu చౌరస్తా నుంచి జిమ్‌ వరకు...!

Published on Tue, 07/08/2025 - 09:38

‘మాట్లాడితే నవ్వు. నడిస్తే నవ్వు. నా జీవితం నవ్వుల పాలైంది’ అంటూ నిరాశ చీకట్లో అనీ మంగుళూరు మగ్గిపోయి ఉంటే... ఎంతో మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది కాదు. భిక్షాటన స్థాయి నుంచి అయిదు ఆటోల యజమాని స్థాయికి ఎదిగిన అనీ ఇతరులకు ఉపాధి ఇవ్వడంతో పాటు ట్రాన్స్‌జెండర్‌ వృద్ధులకు అండగా ఉంది.

కర్నాటకలోని రాయచూర్‌లో పేదింట్లో పుట్టిన అజిబాబు మాటతీరు, నడక అమ్మాయిలను పోలి ఉండేవి. దాంతో స్కూల్‌ రోజుల నుంచి వెక్కిరింపులు, అవమానాలు కొత్త కాక΄ోయినా మంగుళూరులో డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ఎదుౖరైన చేదు అనుభవాలు తనకు చదువును దూరం చేశాయి. చదువును మధ్యలోనే వదిలేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీలో చేరాడు.

జెండర్‌ చేంజ్‌ సర్జరీ తరువాత అనిబాబు అనీ మంగుళూరుగా మారింది. సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం అయింది. ఉద్యోగం దొరకడం గగనం అయింది. గత్యంతరం లేక భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అమ్మ ఇచ్చిన కొద్దిమొత్తంతో ఆటో కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టింది అనీ. ఆటో కొనడం తన జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. మరో మూడు ఆటోలు కొనేస్థాయికి, ఇతరులకు ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగింది.

అయినప్పటికీ ‘ఇక నాకు ఎలాంటి కష్టాల్లేవు’ అనుకోలేదు అనీ. కష్టాల్లో ఉన్న ట్రాన్స్‌జెండర్‌లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.అనీ నటి కూడా. ‘శివలీల’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే అనీ ఇప్పుడు జిమ్‌ ట్రైనర్‌గా మారింది.ట్రాన్స్‌ జెండర్‌ వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలనేది అనీ లక్ష్యం

ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

Videos

గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి

గుడివాడలో పచ్చ తాలిబన్ల పైశాచికం

Vijayawada: పనిమనిషే ప్రాణం తీసింది

గుడివాడలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్ YSRCP నాయకులు స్ట్రాంగ్ కౌంటర్

ముదురుతున్న భాషా యుద్ధం

రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ జగన్ ఆగ్రహం

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసు

కర్ణాటక యాదగిరిలోని గుల్జాపుర్ బ్రిడ్జి వద్ద దారుణం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై ప్రకాశ్ రాజ్ సెటైరికల్ పోస్ట్

Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

Photos

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అమెరికా స్వాతంత్ర్య దిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

‘యువి కెన్‌’ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన భార‌త ప్లేయ‌ర్లు (ఫోటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో వరుణ్‌తేజ్‌.. చాయ్‌ తాగుతూ (ఫోటోలు)

+5

గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)