Breaking News

పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!

Published on Mon, 03/02/2026 - 11:58

వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

అతడే సుమిత్‌ మిట్టల్‌ తన మొత్తం సక్సెస్‌ జర్నీని సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. 

దాంతో కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్‌సెట్‌లో ఆల్‌ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్‌లో ఎంసీఏ చేసే రేంజ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్‌ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. 

చివరగా సుమిత్‌ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్‌ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: హార్ట్‌బీట్‌ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)