Breaking News

వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా!

Published on Tue, 12/23/2025 - 16:01

ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్‌జర్నీ స్టోరీని చిరాగ్‌ అనే యూజర్‌ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

ఏం జరిగిందంటే.. చిరాగ్‌ తన పోస్ట్‌లో "ఇవాళ ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్‌ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్‌తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్‌గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్‌? ఏ కళాశాలలో చదువుతున్నావ్‌? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్‌ అడిగాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

"ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్‌ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్‌గా మారింది. ఆ రైడర్‌ తాను అమిటీలో హోటల్ మేనేజ్‌మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్‌ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 

కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్‌ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. 

అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్‌ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్‌గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్‌ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్‌ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్‌ మీడియా యూజర్‌ చిరాగ్‌.

 

(చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్‌ నుంచి బిలియనీర్‌ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)