Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్లు పైబడ్డ కూడా..
Published on Thu, 01/29/2026 - 11:31
మనషుల ప్రవర్తనలు చాలామటుకు చుట్టూ ఉన్న మనుషులు లేదా అతడు పెరిగిన కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అది అతడి అభ్యున్నతికి ఉపకరించేలా ఉంటే పర్లేదు..తనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవ్వుతాయి. ముఖ్యంగా మగపిల్లలను తల్లులు ఎంతలా గారాబం చేస్తుంటారంటే..వాళ్లేం చేసినా కరెక్ట్, ఆడపిల్ల వరకు వచ్చేటప్పటికీ..పరాయి ఇంటికి వెళ్లాల్సింది బాధ్యతతో వ్యవహరించాలన్నట్లుగా పెంచుతారు. బాధ్యతల విషయంలో ఇద్దరు సమానం అన్న ఆలోచన లేమి..ఎంతటి పరిస్థితికి దారితీస్తుందంటే..కట్టుకున్న భార్యతోపాటు, చుట్టు ఉన్నవాళ్లకు, అలాగే తనకు సమస్యగా మారిపోతాడు. మొగ్గగా ఉన్నప్పుడే ఆ ధోరణి సరవ్వాలి లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ఈ వృద్ధుడే ఉదాహరణ..
ముంబై విమానాశ్రయంలో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఇలా వివరించింది. ఆ పోస్ట్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఓ 50 ఏళ్ల వ్యక్తి రెండు క్యూల వద్దకు వచ్చాడు. అవి ఎయిర్ ఇండియా, ఇండిగో కోసం ఉన్న క్యూలు. అయితే ఆ వ్యక్తి తప్పుగా క్యూలో నిలబడి ఉండటంతో..సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది ఆ క్యూ కాదు అని చెబుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అరవడం మొదలుపెట్టాడు.
దాంతో అక్కడున్న వాళ్లు ఏం మాట్లాడలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో అతడి కుటుంబం జోక్యం చేసుకుని అతడిని శాంత పరిచేంతవరకు అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాడు. అదంతా చూశాక.. సదరు మహిళ ఇలాంటి మానసిక ప్రవర్తనను రాజా బేటా సిండ్రోమ్‌గా పేర్కొంది. ఇదేమి మానసిక రోగం కాదని, చిన్నప్పటి నుంచి తానేం చేసిన కరెక్ట్ అనే ధోరణిలో పెరిగిన వాళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని, దీని కారణంగా చుట్టూ ఉన్నవాళ్లకు, తనకు సమస్యలు సృష్టిస్తారని అన్నారామె. దక్షిణాది కుటుంబాలలో ముఖ్యంగా పురుషలలో ఈ ధోరణి ఉంటుందని, అందుకు తల్లులు, వారి కుటుంబ ఆలోచన విధానమేనని అన్నారామె.
అబ్బాయి కాస్త ఎక్కువ, అమ్మాయిలు కాస్త తక్కువ అనే భావజాలంతో ఉండే కుటుంబాలలో పురుషల మనస్తత్వం ఇలానే ఉంటుందని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకోండి లేదంటే..నెమ్మదిగా ఒక సమయానికి మనుషులు దూరమైపోతారంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు కూడా తమ కుటుంబంలోని వ్యక్తులు గురించి వివరిస్తూ..తమ అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: రుద్ర హెలికాప్టర్‌ని నడిపిన తొలి మహిళా పైలట్..! ఒంటరి తల్లి..)
Tags : 1