Breaking News

అడవిలో చెట్టుకు గొలుసులతో కట్టేసి దీన స్థితిలో విదేశీ మహిళ: ఇది భర్త పనేనా?

Published on Mon, 07/29/2024 - 17:07

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో దుర్భర పరిస్థితుల్లో 50 ఏళ్ల మహిళను గుర్తించారు. చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసి  దీన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఒక గొర్రెల కాపరి ఆమె కేకలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లలితా కయీగా బాధిత మహిళను గుర్తించారు. అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్‌, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళను సావంత్‌వాడి (కొంకణ్)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స  అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందనీ, కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించి ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు ఉన్నాయని  పోలీసులు తెలిపారు.

ఆధార్‌ కార్డు, యూఎస్‌ పాస్‌పోర్ట్‌ ఆధారంగా ఆమె ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లోవాకబు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. పోలీసులకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం,  ఆమె వీసా గడువు ముగిసింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వారితో  సంప్రదిస్తున్నామని వాస్తవానికి అమెరికాకు చెందినదని. గత పదేళ్లుగా దేశంలో ఉంటోందని భావిస్తున్నామని వెల్లడించారు.

అంతేకాదుఎంతకాలం నుంచి ఇక్కడ బంధించబడి ఉందో తెలియదనీ, రెండు రోజులుగా ఏమీ తినక పోవడంతో, స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనీ చెప్పారు.  తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఆమెను అక్కడ కట్టేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు.  
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)