Breaking News

MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్‌ కుమరుడు ఇతడు...

Published on Thu, 01/30/2025 - 11:07

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా  (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో  చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి  సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.

తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ‘కలియుగ్‌ శ్రవణ్‌ కుమార్‌’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.

పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్‌కు చెందినమాలిక్ (Malik) వయసు  65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న  ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ  కుంభమేళాకు  తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్‌ నగర్‌ నుంచి ప్రయాగరాజ్‌కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు.  అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.  

‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్'  అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు.  "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు