Breaking News

Maha Kumbh 2025: ఈ జంట చేసిన పనికి నెటిజన్లు..!

Published on Wed, 01/29/2025 - 14:57

జాతరలు, మేలాల సందర్భంగా కొంతమంది తప్పిపోవడం, కుటుంబం నుంచి విడిపోవడం లాంటి అనేక సంఘటనలు గతంలో చాలా చూశాం. ఇలాంటి ఉదంతాలపై అనేక సినిమాలు కూడా రూపొందాయి. లక్షల జనసమూహంతో ప్రజలు ఒకచోట చేరే మహాకుంభ్ మేళా ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.  కుంభమేళాలో తప్పిపోకుండా ఉండేందుకు ఒక జంట స్పెషల్‌ సొల్యూషన్‌ వెదుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025కు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. 144 సంవత్సరాల తర్వాత, పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తేతమ పాపాలు తొలగిపోయి  మోక్షం లభిస్తుందని  భక్తులు విశ్వసిస్తారు.

'లవ్ ఎట్ ఇట్స్ పీక్'

కుంభమేళాకు వచ్చిన వీరు తాము తప్పిపోకుండా ఉండేందుకు ఒకరికొకరు తాడుతో కట్టేసుకున్నారు. భారీ జనసమూహం మధ్య, తాము కనెక్ట్ అయ్యేలా, విడిపోకుండా చూసుకోవడానికి ఈ  మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దృశ్యాలు పలువుర్ని విపరీతంగా ఆక‌ర్షించాయి. మహిళ తన తలపై ఏదో బరువు మోస్తోంది.  వెనక కాస్త పెద్దవాడిగా కనిపిస్తున్న పురుషుడు వెడుతున్నాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్‌మారింది.

ఇన్‌స్టాగ్రామ్ పేజీ- @log.kya.sochenge లో ఇది  షేర్‌ అయింది.మహా కుంభ్‌కు హాజరైన ఒక జంట  ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి తమను తాము తాడుతో కట్టుకున్నారు.  ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రత్యేక  శ్రద్ధ, భక్తి అందర్నీ ఆకర్షించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభ్‌లో ఇటువంటి హృదయపూర్వక దృశ్యాలు ఐక్యతాసారాన్ని  ప్రతిబింబిస్తాయంటూ ఈ పేజ్‌  పేర్కొంది. ఇప్పటికే ఇది 40.1 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. 

 సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట క్రియేటివిటికీ, ప్రేమకు ముగ్ధులై పోయారు.  ‘‘పొద్దున్నలేస్తే సెలబ్రిటీల  విడాకుల వార్తలతో విసిపోతున్న మనకు ఈ రకమైన క్లిప్‌లు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి” అని ఒకరు, "ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు’’ అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. 
 

 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)