Breaking News

1894లో తీసుకున్నాడు.. 2026లో ఇచ్చేశాడు.. అసలేం జరిగిందంటే?`

Published on Sun, 10/04/2026 - 01:59

లైబ్రరీలో ఎవరైనా పుస్తకం రెండు రోజులు ఆలస్యంగా ఇస్తారు. లేదా రెండు వారాలు! కానీ అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా శతాబ్దం దాటాక రిటర్న్‌ చేశారు. అసలు ఏమైందంటే?

1894 సెప్టెంబర్‌లో తీసుకున్న మ్యాగజైన్‌ ను తాజాగా లైబ్రరీకి తిరిగి ఇచ్చారు. అంటే దాదాపు 132 ఏళ్ల తర్వాత! ఆ మ్యాగజైన్‌  ‘ది సెంచరీ ఇలస్ట్రేటెడ్‌ మంత్లీ’. ఇన్నేళ్లు అది తన ఇంట్లో ఎలా చేరిందో తనకే తెలియదని జాన్‌  అనే వ్యక్తి లైబ్రేరియన్లకు చెప్పారు. ఇటీవల లైబ్రరీలో పాత బకాయిల ఫైన్‌  మాఫీ చేస్తున్నారని తెలుసుకుని, వెంటనే మ్యాగజైన్‌ ను తిరిగి ఇచ్చేశారు.

లేకపోతే 48,220 రోజుల ఆలస్యానికి 12,055 డాలర్ల ఫైన్‌  పడేది! అదృష్టవశాత్తూ లైబ్రరీ ప్రస్తుతం ఓవర్‌డ్యూ ఫైన్లను నిలిపివేసింది. దీంతో జాన్‌  జేబుకు భారీ ఊరట! అయితే ఈ మ్యాగజైన్‌ ను మళ్లీ చదవడానికి షెల్ఫ్‌లో పెట్టలేదు. భవిష్యత్తులో దీనిని ప్రత్యేక ప్రదర్శనలో ఉంచే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి లైబ్రరీకి వచ్చిన ఈ లేట్‌ రిటర్న్‌ మరో అద్భుతంగా చరిత్రలో నిలిచిపోనుంది!

ఇదీ చదవండి: తొంభైలోనూ తొణకని కండలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)