Breaking News

'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

Published on Thu, 05/01/2025 - 13:59

చాలా రకాల డైట్‌లు, వాటి ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ డైట్‌లలో కొన్ని మంచివైతే..మరికొన్ని మన శారీరక ధర్మానుసారం వైద్యులను సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా.. సరికొత్త డైట్‌ ట్రెండ్‌ అవుతుంది. దీర్ఘాయువుని అందించే సూపర్‌ డైట్‌గా శాస్త్రవేత్తలచే కితాబులందించుకుంది. అదీగాక ఈ డైట్‌తో మంచి ఆర్యోగం సొంతం అని హామీ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఏంటీ డైట్‌..? అదెలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం.!.

ఐకానిక్‌ పర్వతం 'కిలిమంజారో' పేరుతో ఉన్న ఈ డైట్‌ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపోయాలే సత్ఫలితాలనిస్తోందట. డచ్‌ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ నమ్మకంగా చెబుతున్నారు. పాశ్చాత్యా ఆహార విధానం కంటే.. ఈ డైట్‌తోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిపారు. 

అందుకోసం టాంజానియా(Tanzania)లోని ప్రజలు, ముఖ్యంగా అగ్ని పర్వతాలకు సమీపంలో నివశించే ప్రజలపై పరిశోధనలు చేయగా.. వివిధ ప్రాంతాల్లో ఉండే మానవాళి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉండటం గమినించారు. వాళ్లంతా కిలిమంజారో డైట్‌ని అనుసరిస్తారట. పరిశోధకులు సగటున 25 సంవత్సరాల వయస్సు గల దాదాపు 77 మంది ఆరోగ్యకరమైన టాంజానియన్ పురుషులపై అధ్యయనం చేశారు. 

వారిలో 23 మంది కిలిమంజారో ఆహారాన్ని అనుసరించగా, 22 మంది ప్రాసెస్ చేసిన ఆహారం అందించారు. అయితే కిలిమంజారో డైట్‌ తీసుకున్నావారిలో వాపు తగ్గుదల,  మెరుగైనా రోగనిరోధక పనితీరు ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడితో ఆపకుండా వారాలు తరబడి ప్రయోగాలు కొనసాగించగా..సానుకూల ప్రయోజనాల తోపాటు, దీర్ఘాయువుకి తోడ్పడుతుందని తెలుసుకున్నారు. 

కలిగే లాభాలు..

  • అనేక దీర్ఘకాలిక పరిస్థితులకు వాపులే మూలం. వాటిని ఈ డైట్‌ నివారిస్తుంది. 

  • జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది

  • గుండె జబ్బులు, మధుమేహం, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

  • కేన్సర్‌ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. 

  • చివరగా ఇది దీర్ఘకాలిక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఆహారం.

ఇక టాంజానియా అధికారికంగా బ్లూ జోన్‌గా గుర్తింపు సైతం దక్కించుకుంది. ఇక్కడ బ్లూజోన్‌ అంటే ఆ ప్రాంతంలోని ప్రజలు సగటున ఎక్కువ కాలం జీవించడం, మంచి ఆరోగ్యపు అలవాట్లు కలిగి ఉంతే..ఆ దేశానికి ఈ గుర్తింపు ఇస్తారు. అంతేగాదు ఇక్కడ సగటు ఆయుర్దాయమే 67 సంవత్సరాలంటే..ప్రజలంతో ఎంత మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ డైట్‌లో ఏం ఉటాయంటే..

  • కిలిమంజారో ఆహారంలో ఓక్రా, అరటిపండ్లు, కిడ్నీ బీన్స్, మొక్కజొన్న వంటి సరళమైన ఆహారాలే ఉంటాయట. ప్రాసెస్‌ ఫుడ్‌కి చోటుండదు. 

  • మెక్కల ఆధారిత ఆహారాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు.

  • ప్రోబయోటిక్‌లను కలిగి ఉన్న సౌర్‌క్రాట్, పులియబెట్టిన ఆహారాలు కూడా ఉంటాయి. 

  • మెడిటేరియన్‌ డైట్‌తో సమానంగా సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించాలనుకునే వారికి ఇది   బెస్ట్‌ డైట్‌ అని అన్నారు. రానున్న కాలంలో కిలిమంజారో ఆహారం దీర్ఘాయువుకు సీక్రెట్‌గా ఉంటుందని అన్నారు నిపుణులు. అలాగే ఈ డైట్‌లో తీసుకునే ఆహారాలు అకాల మరణాలను చాలా వరకు నివారిస్తాయని నమ్మకంగా చెప్పారు పరిశోధకులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: రన్నింగ్‌ రేసులో బామ్మ వరల్డ్‌ రికార్డు ..! ఆమె ఫిట్‌నెస్‌కి శాస్త్రవేత్తలు సైతం ఫిదా..)
 

 

#

Tags : 1

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)