Breaking News

లైవ్‌ కిచెన్‌..! నేరుగా వీక్షిస్తూ..ఆస్వాదించేలా..

Published on Fri, 10/10/2025 - 10:49

భాగ్యనగర వాసులకు నాలుగు రకాల ప్రత్యేక వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ‘4–నోట్‌’ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇది లైవ్‌ కిచెన్స్‌ థియేటర్‌గా రూపొందించిన సరికొత్త రెస్టారెంట్‌. 

అతిథులు రెస్టారెంట్‌ లోపల లేదా బయట కూర్చొని ప్రతి షో కిచెన్‌ నుంచి వంటకాలను ఆర్డర్‌ చేసుకొని, వైవిధ్య భరిత రుచుల అనుభవాన్ని పొందే సౌకర్యాన్ని ఈ రెస్టారెంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 4–నోట్‌లో ఒకే స్థలంలో నాలుగు ప్రత్యేక కిచెన్స్‌కు అతిథ్యమిచ్చేలా రూపొందించారు. ముఖ్యంగా నార్త్‌ ఇండియన్, ఓరియంటల్, తెలుగు రుచులు, యూరోపియన్‌ వంటకాలను, అతిథులు లైవ్‌ కిచెన్‌ ప్రదర్శనలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. 

ప్రతి వంటకం వారి ముందు తయారయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆహార ప్రియులు ఉత్సాహంగా, ఆనందంగా, ఓ అద్భుతమైన థియేటర్‌ అనుభవంగా మారనుంది. ఈ కార్యక్రమంలో హయత్‌ హైదరాబాద్‌ మేనేజర్‌ క్రిసెల్లె ఫెర్నాండేజ్, ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ అలోక్, అసోసియేట్స్‌ డైరెక్టర్‌ మిచెల్‌ ఎవాన్స్, డైరెక్టర్‌ ఆఫ్‌ సేల్స్‌ శ్రావణ్‌బతినా పాల్గొన్నారు. 

మరచిపోలేని అనుభవం కోసం.. 
4–నోట్‌ కేవలం రెస్టారెంట్‌ మాత్రమే కాదు. ఇది లైవ్‌ కిచెన్‌. క్యూరేటెడ్‌ ఫుడ్‌తో ఆతీ్మయ అనుభూతి కలిగిస్తుంది. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో 4–నోట్‌ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ప్రపంచ స్థాయి, హైదరాబాద్‌ అతిథులను అలరించేలా, మెప్పించేలా వైవిధ్యమైన రుచులను ఈ లైవ్‌ కిచెన్‌ థియేటర్‌ అందిస్తుంది.  
– పియుష్‌శర్మ, హయత్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ బివరేజ్‌ డైరెక్టర్‌  

(చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్‌ సక్సెస్‌ అయినట్లే..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)