Breaking News

హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్‌లా ఇంత అందమా? ఎలా?

Published on Wed, 10/29/2025 - 14:48

సింహాలు పౌరుషంతో గంభీరంగా కనిపిస్తాయి.మగ సింహాలు  అందమైన జూలుతో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మరి జూలు  రింగు రింగులుగా ఉంటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో  కర్లీ మేన్ సింహం బ్యూటీ చర్చకు దారిసింది.

"హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ది వైల్డ్" ("Handsome Boy In The Wild") అంటూ  మసాయి మారా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కాంబిజ్ పౌర్ఘనాద్ తీసిన కర్లీ మేన్ సింహం అరుదైన ఫోటో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది.ఇది వన్యప్రాణి ప్రియులను బాగా  ఆకట్టుకుంటోంది.

 మగ సింహాల  శరీరం రంగు ,ఆకృతి చాలా మారుతూ ఉంటాయి.  కానీ  జుట్టు ఇలా మారడం చాలా అరుదు. ఎంతో  ఓపిగ్గా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లు అలాంటి సింహ రాజాలను పరిచయం చేస్తూ ఉంటారు. అలా గిరిజాల జుట్టుతో ఉన్న సింహం  అద్భుతమైన క్లోజప్ ఫోటోలను తీశారు. అడవిలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాన్ని తన కెమెరాలలో బంధించారు. సెలూన్ బ్లోఅవుట్   చేసి  చక్కగా మేకప్‌ చేసినట్టు అందంగా కనిపించింది. ఈ అందమై హీరో  పేరు న్జురి - M6. ఒలెపోలోస్ కుమారుడు . అలాగే  కెన్యాలోని మసాయి మారాలో  ఏడు టోపి ప్రైడ్  సింహాల్లో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ  సింహం ఫోటోను షేర్‌  చేస్తూ ఇలా కామెంట్‌ చేశారు ’’రాసి పెట్టుకోండి, న్జురి ప్రస్తుతం మసాయి మారాలో అత్యంత అందమైన సింహాలలో ఒకటి. అలాగే అందంలో  భవిష్యత్తులో ఆఫ్రికాలో బాన్ జోవి, కింగ్ మోయా ,బ్లాండీ సరసన నిలబడుతుంది’’ అని. 

 

 

ఫోటోలో న్జురి అద్భుతమైన అలలుగా, దాదాపుగా స్టైల్ చేయబడిన మేన్ తో కనిపిస్తుంది, ఇది సాధారణ అడవి సింహం మేన్ కంటే లాగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం, అధిక తేమ , వర్షంలో తడిసిన తర్వాత సహజంగా ఎండిన మేన్ కలయిక వల్ల కర్ల్స్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ప్రకృతి  చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వన్యప్రాణుల ఔత్సాహికులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంటోంది. భలే ముద్దుగా గిరజాలు అని  ఒకరు, "హ్యాండ్సమ్ బాయ్!  సినిమా స్టార్‌లా ఉన్నాడు" అని ఒక యూజర్‌ చమత్కరించారు.   "ఎంత అందం, దురాశాపరుడైన మానవుని చేతిలో దానికి నష్టం కలగకుండా చూడాలి అతన్ని రక్షించాలి" అని ఒకరంటే, " ఒక అందమైన సింహం, మారా నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని  అంటూ మరొకరు కమెంట్‌ చేశారు. దీంతో  న్జూరి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.

ఇదీ చదవండి : పాపం.. పిల్లి అనుకుని పాంపర్‌ చేశాడు, వైరల్‌ వీడియో

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)