Latte లాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. ఏమిటీ ‘ చిత్రం’

Published on Wed, 06/11/2025 - 15:35

పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళ కళ లాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాల ప్రియుల్ని అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులనూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాల నాటిదేనని ఇటలీ, బ్రెజిల్‌ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్‌ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళలను ఆవిష్కరిస్తోంది.  – సాక్షి, సిటీబ్యూరో 


Latte Coffe చిత్రకారులు కాఫీపొడి, డికాక్షన్‌ వగైరాలతో పోట్రెయిట్స్, వన్యప్రాణుల చిత్రాలు, ల్యాండ్‌ స్కేప్‌లు, ఆబ్‌స్ట్రాక్ట్స్‌.. సృష్టిస్తున్నారు. ఆర్గానిక్‌ కలర్‌ ఉపయోగించడం కాఫీ ఆర్ట్‌ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రీయ లేత, ముదురు బ్రౌన్‌ కలర్‌ ఆధారిత షేడ్స్‌ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకుని బ్రష్‌ లేదా స్పాంజ్‌ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా, అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి.  

 సోషల్‌ మీడియా ప్రచారం.. 
మన దేశంలో ఈ కళ కొంత కాలంగా సోషల్‌ మీడియా ద్వారా బాగా విస్తరిస్తోంది. యువ కళాకారులు తమ ఇన్‌స్టా ఖాతాలు, యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా కాఫీ ఆర్ట్‌ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో.. కాఫీతో పోట్రెయిట్స్‌ ఆవిష్కరించడం ద్వారా తమిళనాడుకు చెందిన ధనంజయన్‌ కాఫీ ఆర్ట్‌ ద్వారా బాలీవుడ్‌ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్‌ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్‌కు చిరునామాగా మారారు. 

నేను ఆర్కిటెక్ట్‌ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళల పాఠాలు మాత్రమే నేర్పించేవారు. కానీ చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాలిని. ఒక ఆర్కిటెక్ట్‌గా నన్ను నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించి ఇంకో కలర్‌గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్‌ బేస్డ్‌ కావడం, నాకు వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌లో ఆసక్తి ఉండడం బెస్ట్‌ ఛాయిస్‌ అయ్యింది. పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆశక్తి, ఆ ఉల్లాసం..అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్‌తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్‌ కోసం వాటర్‌ కలర్స్‌ కూడా కాఫీ పెయింటింగ్స్‌కి జోడించా. ఇటీవల పెయింటింగ్స్‌కి కాఫీతో బ్యాక్‌గ్రౌండ్‌ వేస్తూ, ఆపై వేరే రంగులతో పెయింట్‌ చేస్తున్నా. దీని వల్ల వింటేజ్‌ లుక్‌ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్‌ నేపథ్యంలో వేసిన పెయింటింగ్‌ చూసి హ్యారీ పోటర్‌ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్‌స్టా పేజ్‌లో షేర్‌ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం.  – జ్యోత్స్న మైథిలీ రెడ్డి, కాఫీ ఆర్టిస్ట్‌ 

నగరంలోనూ సందడి.. 
నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్ట్‌ హౌస్‌ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆర్ట్‌ స్టూడియోగా పేరొందింది. అలాగే నల్లగండ్లలోని కవి ఆర్ట్‌ స్టూడియో, గచి్చ»ౌలిలోని థర్డ్‌ వేవ్‌ కేఫ్, జూబ్లీహిల్స్‌లోని మాక్రో బ్రూ వరల్డ్‌ కాఫీ బార్, బంజారాహిల్స్‌లోని లాట్టే ఆర్ట్‌ కెఫేలో కాఫీ ఆర్ట్‌ వర్క్‌షాప్‌ల నిర్వహించడంతో పాటు  కాఫీతో తయారు చేసిన పెయింటింగ్‌లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని లైజురే ఆర్ట్‌ కేఫ్‌ కాన్వాస్, క్రేవింగ్స్, కెఫైన్‌ కాన్సెప్‌్టతో అతిథులను ఆకట్టుకుంటోంది. ఫిల్మ్‌ నగర్‌లోని బాగ్‌ బీన్స్‌ కాఫీ అండ్‌ ఆర్ట్‌లో కాఫీ ఆర్ట్‌ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. 

ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం

లాట్టే.. కాఫీకప్పు  ఆకట్టే.. 
కాఫీని రంగుగా వినియోగించే ఆర్ట్‌ ఒకెత్తయితే, కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాట్టే ఆర్ట్‌గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీన్ని గతంలో కాఫీ షాప్స్‌లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్‌ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతోంది. దీంతో కాఫీ ఆర్ట్‌ అంత కాకపోయినా అడపాదడపా లాట్టే ఆర్ట్‌ వర్క్‌షాప్స్‌ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్‌ గౌడ్, రాధాకృష్ణ వంటివారు ఈ లాట్టే ఆర్ట్‌కు పేరొందారు.  

మరింత చేరువగా... 
దాదాపు నగరంలో పేరున్న కేఫ్స్‌ అన్నీ చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్‌ వంటి ఈవెంట్స్‌ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్‌ మరింత చేరువ అవుతోంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికవుతోన్న ఈ కాఫీ ఆర్ట్‌ ప్రపంచస్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించినా ఆశ్చర్యం లేదు.   (పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)