Breaking News

ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్‌పీజీ’ వైరల్‌ : తప్పులో కాలేసిన కంగనా

Published on Fri, 11/29/2024 - 14:12

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో  తెగ వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా  హీరోయిన్‌,   బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో  లేడీ ఎస్‌పీజీ అంటూ  ఈ ఫోటోను షేర్‌ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి  కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది.   అసలు సంగతి ఏంటంటే..

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్  పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో  పక్కన బ్లాక్‌ డ్రెస్‌లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో  ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న  ఎస్‌పీజీ అంటూ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 

దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్‌పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే  ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్‌పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని  వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో  ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)