Kondagattu Anjanna అంజన్న కొండ.. భక్తులకు అండ

Published on Wed, 05/28/2025 - 11:36

మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం(Kondagattu Anjaneya Swamy Temple) రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. సామాన్యుల నుంచి మొదలుకొని, ప్రముఖుల వరకు కొం డగట్టులోనే తమ వాహనాల పూజ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఏటా వాహన పూజల భక్తుల సంఖ్య పెరుగుతోంది. మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు జనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తరలి వస్తుండటంతో నిత్యం కొం డగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శిం చుకోవడంతోపాటు, నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ, వాహన పూజలు చేసుకుంటున్నారు.

మంగళ, శనివారాల్లో..
కొండగట్టులో నిత్యం వాహన పూజలతోపాటు ప్రతి మంగళవారం, శనివారాల్లో నూతన వాహనాలకు వాహనదారులు పూజలు చేసుకుంటారు. రాష్ట్రవ్యా ప్తంగా హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాం తాల నుంచి వాహనాల కొనుగోలు అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేస్తుంటారు. ప్రతి వాహనానికి ఒక్కసారి అయినా అంజన్న సన్నిధిలో పూజ నిర్వహించాలని ఏటా వేలాదిమంది వాహనదారులు కొండగట్టులో తమ వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు. కొం డగట్టులో ఏటా దసరా పండుగ రోజు వేలాది మం ది వాహనదారులు తమ వాహనాలకు పూజలు చేసుకుంటారు. (పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌)

ఆంజనేయస్వామి అభయహస్తం..
శ్రీరాముడికి వాహనం హనుమంతుడు.. ఎక్కడికి వెళ్లినా తిరుగులేని కార్యాలు సాధించిన ఘనుడు హనుమంతుడు. ఈ నేపథ్యంలో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు కలుగవని, శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు తమవాహనాలను కొండగట్టులో పూజలు నిర్వహిస్తుం టారు. చొప్పదండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన వాహనానికి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహిం చారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు చేయించడం కొండగట్టు ప్రత్యేకతకు అద్దం పడుతోంది.

ఇదీ చదవండి : స్కూల్‌ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు

ఏటా రూ.20 లక్షల ఆదాయం
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వాహన పూజలు నిర్వహించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతుండటంతో ఏటా వాహన పూజ ఆదాయం పెరుగుతోంది. వాహన పూజల ద్వారా సుమారు రూ.20 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. వాహనదారుల సౌకర్యం కోసం, స్వామివారి ఉచిత గర్భగుడి ప్రవేశం కల్పించి, స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది వాహనదారులు కొండగట్టులో వాహన పూజలతోపాటు, స్వామివారిని దర్శించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

వాహనదారులకు అభయం 
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నూతన వాహనాలతో పాటు ఏటా ప్రతి దసరా పండుగకు ఉపయోగించే వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. కొండగట్టులో వాహనాలకు పూజలు నిర్వహిస్తే, ఆంజనేయస్వామి అభయం ఇస్తారని, ఎటువం టి ప్రమాదాలు జరుగవని భక్తుల విశ్వాసం. వాహన పూజల కోసం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చి, తమ వాహనాలకు పూజలు చేసుకుంటున్నారు.
- రామకృష్ణకొండగట్టు ఆలయ ప్రధాన అర్చకుడు

స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి 
కొండగట్టులో వాహన పూజలకు వచ్చే భక్తుల కుటుంబాలకు స్వామివారి గర్భగుడి ప్రవేశం కల్పిం చాలి. ఏటా వాహనాలకు స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తాం. వాహన పూజకు ముందు స్వామివారి దర్శనం కోసం వెళ్లడంతో క్యూ లైన్లలో నిలబడటంతో జాప్యం జరుగుతోంది. వాహనపూజలు చేసుకునే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి. 
- కొక్కుల రఘు, మల్యాల

చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్‌: సమంతా స్టన్నింగ్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా

Videos

కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు

పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..

మాచర్లలో చీలిన టీడీపీ

అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు

అనంతలో గన్ కల్చర్

శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!

నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై

భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

Photos

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)

+5

'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)

+5

ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)