Breaking News

గ్రీన్‌ ఐడియా: పేదింటి తల్లలు కోసం..!

Published on Thu, 11/20/2025 - 10:46

చిన్న వయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు రాఘవ్‌ రాయ్‌. ‘మోర్‌ దెన్‌ ప్లే’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం కోసం ఒకరోజు పేద పిల్లలకు ఫుట్‌బాల్‌ ఆట నేర్పించడానికి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ బస్తీకి వెళ్లాడు. ప్రాక్టీస్‌ కోసం వచ్చిన పిల్లలు బలహీనంగా ఉన్నారు. బాగా అలిసిపోయినట్లు ఉన్నారు. వారు తినేది...చౌకైన జంక్‌ఫుడ్‌.

పిల్లలతో మాట్లాడినప్పుడు రాయ్‌కు అర్థమైనది ఏమిటంటే, వారికి పోషకాహారం గురించి బొత్తిగా అవగాహన లేదు అని. తన అనుభవాన్ని స్వచ్ఛంద సంస్థ ‘మోర్‌ దేన్‌ ప్లే’ వ్యవస్థాపకుడు జైదీప్‌ భాటియాతో పంచుకున్నాడు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎన్నోసార్లు సమావేశం అయ్యారు. ‘ఏంచేస్తే బాగుంటుంది?’ అనే కోణంలో  పరిశోధించారు.

పోషకాహార లోపోనికి ఒక పరిష్కారంగా కిచెన్‌ గార్డెన్‌ ఐడియా వచ్చింది. ప్రతి బిడ్డకు పోషకాలతో కూడిన భోజనం ఉండేలా బస్తీలలో కిచెన్‌ గార్డెన్‌లను ఏర్పాటు చేయడమే ఆ ఐడియా. ‘గార్డెన్స్‌ ఆఫ్‌ హోప్‌’ అలా ఆవిర్భవించింది. ‘ఇంటింటా కిచెన్‌ గార్డెన్‌’ లక్ష్యంతో పనిచేస్తోంది గార్డెన్స్‌ ఆఫ్‌ హోప్‌. ‘మీరు సొంతంగా కూరగాయలు పండించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది’ అని ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాన్ని మహిళలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అర్బన్‌ ఫార్మింగ్‌ కన్సల్టెన్ట్, కిచెన్‌ గార్డెన్స్‌ ఎక్స్‌పర్ట్‌ జూలీ సహాయం తీసుకున్నారు. జూలీ, రాయ్‌ గల్లీ గల్లీకి తిరిగారు.

జూలీ మాటలతో ఎంతోమంది తల్లులలో మార్పు వచ్చింది. ‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ ఇలా పలు కోణాలలో కిచెన్‌ గార్డెన్స్‌ గురించి ప్రశ్నలు అడిగి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు గల్లీలలో ఎన్నో ఇళ్లలో కిచెన్‌ గార్డెన్‌లు కనిపిస్తున్నాయి.

మార్పు..
పోషకాహార లోపంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఆ పేదింటి తల్లుల దుఃఖాన్ని దగ్గరి నుంచి గమనించిన ఫుట్‌బాల్‌ కోచ్‌ రాఘవ్‌ రాయ్‌ ‘కిచెన్‌ గార్డెన్‌’ ఐడియాతో ముందుకు వచ్చాడు. దిల్లీలో గల్లీ గల్లీ తిరిగాడు. మహిళలు ఎవరూ అతడి మాటలనుమొదట సీరియస్‌గా తీసుకోలేదు.

అర్బన్‌ ఫార్మింగ్‌ కన్సల్టెన్ట్, కిచెన్‌ గార్డెన్స్‌ ఎక్స్‌పర్ట్‌ జూలీ మాటలతో వారిలో మార్పు వచ్చింది. ఢిల్లీలో ఎన్నో బస్తీలలోని మహిళలు తమకు ఉన్న పరిమిత స్థలంలోనే  కిచెన్‌ గార్డెన్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. రసాయన కూరగాయలకు దూరంగా ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని సొంతం చేసుకుంటున్నారు... 

 

(చదవండి: బాలీవుడ్‌ టు కార్పొరెట్‌ వరల్డ్‌)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)