పిల్లలకు సోషల్‌ మీడియా పరిమితులు : ఫోన్‌పై స్మార్ట్‌చెక్‌

Published on Wed, 06/11/2025 - 10:47

పద్నాలుగేళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా యాప్‌ల వాడకంపై, పరిమితులు విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆన్‌లైన్‌ భద్రతా చట్టాల విషయంలో వివిధ దేశాలు కచ్చితమైన విధానాలనూ అమలు పరుస్తున్నాయి.  కానీ, సోషల్‌ మీడియా మంచి చెడులు పిల్లల విషయంలో ఎప్పుడూ  ప్రశ్నార్థకమే. పిల్లలపై సోషల్‌ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, తల్లితండ్రులే తప్పనిసరి జాగ్రత్తలు తీసు కోవాలంటున్నారు నిపుణులు.  

 

పిల్లలు సోషల్‌ మీడియాలో గడపగల సమయాన్ని పరిమితం చేయడానికి, కఠినమైన ఆన్‌లైన్‌ భద్రతాచ ర్యలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయనే వార్తలు కొంత ఊరటనిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు పిల్లలు వ్యక్తిగత సోషల్‌ మీడియా యాప్‌ల వాడకంపై రోజుకు రెండు గంటల పరిమితి విధించి, ఇరవై రెండు గంటలపాటు బంద్‌ విధించాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు నివేదికలూ సూచిస్తున్నాయి.

స్మార్ట్‌ వ్యసనంపై టాక్‌ షో
బీబీసీ నిర్వహించిన సండే విత్‌ లారా కుయెన్స్‌బర్గ్‌ నిర్వహించిన టాక్‌షోలో పాల్గొన్న యూకే టెక్నాలజీ కార్యదర్శి పీటర్‌ కైల్‌ను ‘సోషల్‌ మీడియా పిల్లల సమయ పరిమితుల గురించి అడిగినప్పుడు, కైల్‌ స్పందిస్తూ ‘కొన్ని యాప్‌లు పిల్లలను స్మార్ట్‌ఫోన్‌కు అంటిపెట్టుకుని, ఫోన్‌ వ్యసన పరులయేలా చేస్తున్నాయి. వాటి బారి నుంచి పిల్లలను రక్షించడానికి ఆన్‌లైన్‌ భద్రత చట్టాల అమలుకు కృషి జరుగుతోంది’ అన్నారు.  

ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను చూసి, తన 14 ఏళ్ల కూతురు మోలీ ఆత్మహత్య చేసుకుందని, ఆన్‌ లైన్‌ భద్రతా చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సరైన నియంత్రణ లేకపోవడం, సాంకేతికత దుర్వినియోగం వల్ల ఎక్కువమంది యువత ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆరోగ్యాలు దెబ్బ తినడాన్ని చూశాం‘ అని ఇయాన్‌ రస్సెల్‌ అనే వ్యక్తి వేదనతో తెలిపారు. దీనికి కైల్‌ స్పందిస్తూ– ‘పిల్లలు ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న హాని సునామీని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని చూసి దేశంలోని తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ స్మార్ట్‌ ఫోన్లకు ప్లాస్టర్‌లను అతికించలేం. పరిమితులను విధించడం వల్ల మేలు జరగదు. ఆరోగ్యకరమైన ఆన్‌లైన్‌ జీవితం ఎలా ఉంటుందో పిల్లలు అర్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలి’ అంటూ అనిత ఈ షోలో తెలిపారు.  

ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌

మనం పరిమితులను ఎంచుకోవచ్చు
యాప్స్‌కి, డిజిటల్‌ పరికరాలను నియంత్రించేందుకు ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. టిక్‌టాక్‌ 2023లో 18 ఏళ్లలోపు వారికి డిఫాల్ట్‌గా 60 నిమిషాల స్క్రీన్‌ సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ అన్ని వయసుల వినియోగదారులను వారి స్వంత పరిమితిని సెట్‌ చేసుకోమంటుంది. ఎంత సమయం బ్లాక్‌ చేయవచ్చో కూడా ఎంచుకోవచ్చు. 2021లో, చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో మాత్రమే 18 ఏళ్లలోపు గేమర్స్‌ను రోజుకు ఒక గంటకు పరిమితం చేసింది. సెలవు దినాల్లో మూడు గంటలకు పెంచింది. యువతపై గేమింగ్‌ ప్రభావం గురించి  తన ఆందోళనలను ఉదహరించి, మరీ ఈ నిబంధనలను విధించింది కేంద్రం. కానీ గత సంవత్సరం డ్రాఫ్ట్‌ అప్‌డేట్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుండి అదృశ్యమైంది. ప్రభుత్వాలు అమలు చేయాలనే కఠిన నిబంధనలకన్నా ముందు కౌమారదశలో ఉన్న పిల్లలకు డిజిటల్‌ సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించడం ముఖ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 

చదవండి: 230 -110 కిలోలకు అద్నాన్‌ సామి :‘ఆపరేషన్‌కాదు,వాక్యూమ్‌ క్లీనర్’
 

తల్లిదండ్రులూ  ఇవి అమల్లో పెట్టండి

  • టెక్నాలజీని బ్లాక్‌ చేయవద్దు. పిల్లలకు సురక్షితంగా సాంకేతికతను ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. 

  • పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్లు గురించి ఆసక్తి చూపుతూనే, వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటూ ఉండాలి..

  • పేరెంట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ వాడకంలో పరిమితులు నిర్దేశించాలి. ఫిల్టరింగ్‌ సాఫ్ట్వేర్‌ వాడేలా జాగ్రత్తపడాలి.

  • కుటుంబ మీడియా ఒప్పందం అంటే.. ప్రయాణం, భోజనం, పడక సమయాలు వంటి ప్రదేశాలను టెక్నాలజీ ఫ్రీ జోన్లుగా మార్చాలి. 

  • ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం గురించి ఏమాత్రమూ వెల్లడించకూడదు అనే విషయాన్ని బోధించాలి. 

  • ఆన్‌లైన్‌ లో సమాచారాన్ని ఫిల్టర్‌ చేయడం, నిజం – అబద్ధం మధ్య తేడా తెలుసుకోవడంలో సహాయపడాలి. 

  • ఆరుబయట పచ్చదనం, స్క్రీన్‌ టైమ్‌ మధ్య సమతుల్యతను  పాటించాలి. వారి శారీరక అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి.

  • 14 ఏళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియా యాప్స్‌ సైన్‌ అప్‌ చేయడంలో సహాయం చేయవద్దు.

  • సోషల్‌మీడియాలో నమ్మదగిన వనరులను అన్వేషించి, వాటిని అందుబాటులో ఉంచాలి. 

పిల్లలకు ఇంటర్నెట్‌ సేఫ్టీ

  • చాలా సైట్లు, వెబ్‌ టూల్స్‌ 13 ఏళ్ల పై వయసున్న యూజర్ల కోసం ఉంటాయి. ఇవి ఆన్‌లైన్‌ కాపీరైట్‌తో భద్రపరిచి ఉంటాయిఆన్‌లైన్‌లో చేస్తున్న వర్క్‌ గురించి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాలి. తాము చూస్తున్న సైట్‌లో తప్పుగా ఏమైనా అనిపించినప్పుడు, ఉపయోగించడంలో మెళకువలు తెలియనప్పుడూ టెక్నాలజీ తెలిసిన పెద్దవారిని అడగాలి.

  • ఆన్‌లైన్‌లో స్నేహితులను తల్లిదండ్రుల అనుమతి లేకుండా యాడ్‌ చేయవద్దు. అవతలి వారు చెప్పిన ప్రతిదాన్నీ నమ్మవద్దు

  • వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలి. పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్, ΄ాస్‌వర్డ్‌లు, ప్లానింగ్‌లు, పుట్టినరోజు.. వంటివి షేర్‌ చేయవద్దు. 

  • ఏది బడితే అది పోస్ట్‌ చేయకూడదు. అది ఒక్కోసారి భవిష్యత్తుకు ప్రమాదంగా మారవచ్చు.

  • మీరు లేదా మీకు తెలిసినవారు బుల్లీయింగ్‌కు గురైనట్లయితే వెంటనే ఆ విషయాన్ని పెద్దవాళ్లకు తెలియజేయాలి.

     

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,
ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)