ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

Published on Sun, 06/21/2026 - 12:28

కొన్ని గాడ్జెట్స్‌ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్‌ మీకోసం..

హాల్‌లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్‌ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్‌లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్‌ చే స్తే టీవీలా, ఆఫ్‌ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్‌ 4కే క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్‌ ట్రిప్‌ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్‌లా కనిపించే ఈ స్మార్ట్‌ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.

బ్యాగ్‌లో మడత కుర్చీ..!
ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్‌ క్యాంపింగ్‌ స్టూల్‌! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.

కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్‌లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ  స్టీల్‌ ఫ్రేమ్, వాటర్‌ప్రూఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ స్టూల్‌ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్‌లు, బీచ్‌ ట్రిప్స్, ట్రెక్కింగ్‌ లేదా గార్డెన్‌లో కూర్చోవడానికి ఇది బెస్ట్‌ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్‌ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)