Breaking News

Anju టెర్రస్‌ గార్డెన్‌లో తోపు : 600కు పైగా గులాబీలు

Published on Sat, 06/28/2025 - 10:45

మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. 

కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే  ప్రాణం. స్కూల్‌లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి,  పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. 

కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్‌ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 

2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్‌లలో పెరిగే టేబుల్‌ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది.  15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్‌పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి  పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి  పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. 

చదవండి: Today Tip : షుగర్‌ పేషెంట్లు ఎగ్స్‌ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
 

ఫేస్‌బుక్‌లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి  పోస్ట్‌ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్‌బుక్‌ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ  వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.  చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట.
 

ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్‌ గోయెంకా విమర్శలు


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)