Breaking News

రికార్డులను చుట్టూ తిప్పుకుంటున్న గాయని.. మూడేళ్లకే!

Published on Fri, 01/12/2024 - 10:53

మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ  అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది.  తన పాటలతో  రికార్డులను తన వెంట  తిప్పుకుంటోంది.

ఒక కాన్సర్ట్‌లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన  సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది.  తన అద్భుత ఘనతను చాటుకుని  గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్‌స్టాలో  షేర్‌ అవుతోంది.  

ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్‌లో జరిగిన COP 28 సమ్మిట్‌కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన విజయాన్ని షేర్‌ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్‌క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్‌ చేశారు.

2018 జనవరిలో  లాంగెస్ట్‌ లైవ్‌ సింగింగ్‌  కన్సర్డ్‌ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే  అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా  సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్‌ బియాండ్‌ బోర్డర్స్‌ గిన్నిస్‌ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్‌లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను  అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది. 

2005 ఆగస్టు17న కన్నూర్‌లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది.  అన్నయ్య సుశాంత్ సతీష్   ఉన్నారు.   2 నెలల వయస్సులో దుబాయ్‌కి షిప్ట్‌. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది.  నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ  పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్‌గా భావిస్తుందిసుచేత సతీష్.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)